Ginger : అల్లం.. దీని గురించి ప్రత్యేకంగాచెప్పవలసిన పని లేదు. వంటల దగ్గర నుండి ఔషధాల వరకు అల్లాన్ని విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాం. అల్లం వంటల రుచి పెంచడంతో పాటు మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. బరువు తగ్గడంలో, శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో, బీపీ ని నియంత్రించడంలో ఇలా అల్లం మన ఆరోగ్యాన్ని కాపాడడంలో ఎంతో సహాయపడుతుంది. అయితే మన ఆరోగ్యానికి మేలు చేస్తుందని కదా అని దీనిని మోతాదుకు మించి ఉపయోగించకూడదు. అల్లాన్ని మోతాదుకు మించి ఉపయోగించడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. గర్భిణీ స్త్రీలు అల్లాన్ని తక్కువగా ఉపయోగించాలి. అల్లాన్ని ఎక్కువగా ఉపయోగించడం వల్ల వారిలో నెలలు నిండకుండానే ప్రసవం అయ్యే అవకాశం ఉంది. కనుక గర్భిణీ స్త్రీలు అల్లం వాడే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.
అలాగే ఉండాల్సిన బరువు కంటే తక్కువ బరువు ఉండే వారు కూడా అల్లాన్ని తక్కువగా ఉపయోగించాలి. అల్లం మన శరీరంలో కొవ్వును కరిగిస్తుంది. తక్కువ బరువు ఉన్న వారు అల్లాన్ని ఎక్కువగా ఉపయోగించడం వల్ల మరింత బరువు తగ్గుతారు. అలాగే వారిలో నీరసం, అలసట వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. కనుక బరువు తక్కువగా ఉన్నవారు అల్లాన్ని ఎక్కువగా ఉపయోగించకూడదు. అదే విధంగా జీర్ణ సంబంధిత సమస్యలు అనగా గ్యాస్, కడుపులో మంట, ఎసిడిటి వంటి సమస్యలతో బాధపడే వారు కూడా అల్లాన్ని తక్కువగా ఉపయోగించాలి. అల్లం ఇటువంటి జీర్ణ సంబంధిత సమస్యలను మరింత పెంచే అవకాశం ఉంది. అలాగే దీర్ఘ కాలిక వ్యాధులకు మందులు వాడే వారు కూడా అల్లాన్ని ఉపయోగించే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మందులు వాడే అల్లాన్ని ఎక్కువగా వాడడం వల్ల ఇతర అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇన్సులిన్ తీసుకునే వారు, రక్తపోటుతో బాధపడే వారు అల్లాన్ని ఎక్కువగా ఉపయోగించకూడదు.

అలాగే రక్త సంబంధిత సమస్యలు ఉన్న వారు కూడా అల్లాన్ని మితంగా తీసుకోవాలి. అల్లం రక్తప్రవాహాన్ని వేగవంతం చేసే దోరణిని కలిగి ఉంటుంది. హిమోఫిలియా అనే రక్త సంబంధిత సమస్య ఉన్న వారు అసలు అల్లాన్ని ఉపయోగించకపోవడమే మంచిది. శరీరంలో వివిధ రకాల శస్త్రచికిత్సలు జరిగిన వారు, గాయాలతో బాధపడే వారు కొంత కాలం వరకు అల్లాన్ని తీసుకోకపోవడమే మంచిది. అల్లం తీసుకోవడం వల్ల గాయాలు త్వరగా మానవు. అలాగే అధిక రక్తపోటుతో బాధపడే వారు అల్లాన్ని తక్కువగా తీసుకోవాలి. అల్లాన్ని ఎక్కువగా ఉపయోగించడం వల్ల రక్తపోటు మరింత పెరిగే అవకాశం ఉంది. అలాగే పిత్తాశయ సమస్యలు ఉన్న వారు కూడా అల్లాన్ని ఎక్కువగా ఉపయోగించకూడదు. పిత్తాశయ సమస్యలు ఉన్న వారు 1500 మిల్లీ గ్రాముల కంటే తక్కువగా అల్లాన్ని తీసుకోవడం మంచిది. ఆర్థరైటిస్ సమస్య ఉన్న వారు అల్లాన్ని ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుందన్న సంగతి మనకు తెలిసిందే.
అయితే ఈ సమస్యలతో బాధపడే వారు అల్లాన్ని ఎక్కువగా ఉపయోగించడం వల్ల నొప్పులు, వాపులు మళ్లీ మళ్లీ రావడం జరుగుతుంది. ఆర్థియో ఆర్థరైటిస్ ఉన్న వారు 140 మిల్లీ గ్రాముల నుండి 150 మిల్లీ గ్రాముల మోతాదులోనే ప్రతిరోజూ అల్లాన్ని తీసుకోవాలి. ఇక థైరాయిడ్ సమస్య ఉన్న వారు అల్లాన్ని మితంగా తీసుకోవాలి. అల్లాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల థైరాయిడ్ గ్రంథి వాపు, థైరాయిడ్ సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది. డిఫ్రెషన్, గుండె సంబంధిత సమస్యలు ఉన్న వారు కూడా ఈ అల్లాన్ని మితంగానే ఉపయోగించాలి. అల్లం మన ఆరోగ్యానికి మేలు చేసినప్పటికి తగిన జాగ్రతలు తీసుకుంటూ మాత్రమే దీనిని ఉపయోగించాలి అప్పుడే దీని వల్ల కలిగే ప్రయోజనాలను మనం పొందవచ్చు.