Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

Cotton Buds : చెవిలో గులిమి తీసేందుకు కాట‌న్ బ‌డ్స్‌ను ఉప‌యోగిస్తున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..!

Admin by Admin
December 19, 2024
in హెల్త్ టిప్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Cotton Buds : చాలా మంది ఇళ్ల‌లో కాట‌న్ బ‌డ్స్ ఉంటాయి. వీటిని అనేక ర‌కాల ప‌నుల కోసం ఉప‌యోగిస్తుంటారు. అయితే వీటితో చాలా మంది ఎక్కువ‌గా చెవుల్లో గులిమి తీస్తుంటారు. చెవుల్లో పేరుకుపోయిన వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు తీసేందుకు కాట‌న్ బ‌డ్స్‌ను చాలా మంది వాడుతుంటారు. అయితే వాస్త‌వానికి చెవుల్లో గులిమి తీసేందుకు కాట‌న్ బ‌డ్స్‌ను ఉప‌యోగించ‌డం అంత మంచిది కాద‌ని వైద్య నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. చెవుల్లో అంత‌ర్భాగం చాలా సున్నితంగా ఉంటుంది. అలాంట‌ప్పుడు కాట‌న్ బ‌డ్స్‌ను ఉప‌యోగించ‌డం ప్ర‌మాద‌క‌ర‌మ‌ని వారు అంటున్నారు. ఇక గులిమి తీసేందుకు కాట‌న్ బ‌డ్స్‌ను వాడ‌డం వ‌ల్ల ఎలాంటి దుష్ప‌రిణామాలు చోటు చేసుకుంటాయో వారు వివ‌రిస్తున్నారు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

చెవుల్లో గులిమి అనేది స‌హ‌జ సిద్ధంగా ఏర్ప‌డే ప‌దార్థం. చెవుల్లో ఉండే బాక్టీరియా, వ్య‌ర్థాలు, దుమ్ము, ధూళి అంతా క‌లిసి గులిమిలా త‌యార‌వుతుంది. ఇది చెవులకు మేలు చేస్తుంది. ఇది బాక్టీరియా, వైర‌స్‌లు లోప‌లికి రాకుండా అడ్డుకుంటుంది. చెవుల‌ను ర‌క్షిస్తుంది. అయితే ఎప్పుడైతే కాట‌న్ బ‌డ్స్ పెట్టి గులిమి తీస్తామో అప్పుడు ఈ ప్ర‌క్రియ‌కు ఆటంకం క‌లుగుతుంది. ఫ‌లితంగా సూక్ష్మ క్రిములు చెవుల అంత‌ర్భాగంలోకి ప్ర‌వేశించే ప్ర‌మాదం ఉంటుంది. అప్పుడు చెవుల్లో ఇన్‌ఫెక్ష‌న్లు క‌ల‌గ‌వ‌చ్చు. అలాగే గులిమిని తీసేట‌ప్పుడు కొన్ని సంద‌ర్భాల్లో అది చెవి లోప‌లి భాగం వైపు నెట్టివేయ‌బ‌డుతుంది. దీంతో చెవుల్లో గులిమి ఏర్ప‌డే ప్ర‌క్రియ‌కు ఆటంకం క‌లుగుతుంది. అలాగే కొన్ని సంద‌ర్భాల్లో చెవి బ్లాక్ చేయ‌బ‌డి వినికిడి లోపం త‌లెత్త‌వ‌చ్చు.

if you are using cotton buds for ear wax then know this ఈఎన్‌టీ వైద్య నిపుణులు చెబుతున్న ప్ర‌కారం చెవుల్లో లోప‌లి వైపు చ‌ర్మం చాలా సున్నితంగా ఉంటుంది. దీనిపై కాట‌న్ బ‌డ్‌ను అటు ఇటు రాపిడి క‌ల‌గ‌జేస్తే అక్క‌డ వాపు ఏర్ప‌డి చ‌ర్మం డ్యామేజ్ అవ‌చ్చు. దీంతో నొప్పి, దుర‌ద‌, మంట ఏర్ప‌డుతాయి. కొన్ని సంద‌ర్భాల్లో ర‌క్త‌స్రావం అయ్యేందుకు కూడా అవ‌కాశాలు ఉంటాయి. అలాగే అక్క‌డ కాట‌న్ బ‌డ్‌తో ప‌దే ప‌దే రుద్ద‌డం వ‌ల్ల చ‌ర్మం దృఢంగా అయి గులిమి ఏర్ప‌డే అవ‌కాశాలు పూర్తిగా త‌గ్గిపోతాయి. దీంతో అక్క‌డంతా బ్లాక్ అయిన‌ట్లు అవుతుంది. ఫ‌లితంగా శాశ్వ‌తంగా వినికిడి స‌మ‌స్య వ‌చ్చే అవ‌కాశాలు ఉంటాయి.

అందువ‌ల్ల చెవుల‌ను చాలా ఆరోగ్యంగా, సుర‌క్షితంగా ఉంచుకోవ‌డం ముఖ్యం. అయితే మ‌రి చెవిలో ఏర్ప‌డే గులిమి వ‌ల్ల చిరాకు పెడుతుంటే ఏం చేయాలి ? అని అంద‌రికీ సందేహం రావ‌చ్చు. అందుకు స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాల‌ను పాటించాలి. చెవుల్లో బాక్టీరియా ఎక్కువైతే దుర‌ద పెడుతుంది. దీంతో చిరాకు వ‌స్తుంది. అయితే దీన్ని త‌గ్గించుకునేందుకు కాట‌న్ బ‌డ్ ల‌ను పెట్టాల్సిన ప‌నిలేదు. చెవుల్లో రెండు చుక్క‌ల కొబ్బ‌రినూనె వేస్తే చాలు. కొబ్బరినూనెలో యాంటీ బాక్టీరియల్‌, యాంటీ వైర‌ల్‌, యాంటీ మైక్రోబియ‌ల్ ల‌క్ష‌ణాలు ఉంటాయి. ఇవి సూక్ష్మ క్రిముల‌ను నాశ‌నం చేస్తాయి. దీంతో చెవుల్లో దుర‌ద త‌గ్గుతుంది. అలాగే గులిమి దానంత‌ట అదే బ‌య‌ట‌కు వ‌స్తుంది. ఇక ఇలా చేయ‌లేమ‌ని అనుకుంటే ఈఎన్‌టీ వైద్యుడిని సంప్ర‌దించ‌డం మంచిది. దీంతో స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

Tags: Cotton Buds
Previous Post

Stuffed Masala Vankaya : మ‌సాలా కూరిన వంకాయ‌ను ఇలా చేయండి.. అన్నంలో తింటే సూప‌ర్‌గా ఉంటుంది..!

Next Post

పండగలకి మామిడి తోరణాలనే ఎందుకు కడతారో తెలుసా?

Related Posts

ఆధ్యాత్మికం

మీ ఇంటి వద్ద‌కు వ‌చ్చి కాకి ప‌దే ప‌దే అరుస్తుందా..? దాని అర్థం ఏమిటంటే..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దేశంలో ఉన్న 18 అష్టాద‌శ శ‌క్తి పీఠాలు ఎక్క‌డ ఉన్నాయి..? అవి ఏమిటి..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దీపారాధ‌న‌కు అస‌లు ఏ నూనె వాడాలి..? దీపారాధ‌న ఎలా చెయ్యాలి..?

July 4, 2025
వినోదం

70 ఏళ్ల వ‌య‌స్సులోనూ ర‌జ‌నీకాంత్ అంత ఫిట్‌గా ఉన్నారంటే..? ఆయ‌న పాటించే దిన‌చ‌ర్య ఎలాంటిదంటే..?

July 4, 2025
technology

స్మార్ట్‌ఫోన్ల పై భాగంలో ఉండే రంధ్రాన్ని ఎప్పుడైనా గ‌మ‌నించారా..? అదేమిటో తెలుసా..?

July 4, 2025
lifestyle

బుల్లెట్ బైక్‌ నే దేవుడిగా చేసి, పూజలు చేస్తున్న గ్రామస్తులు, దీని వెనక పెద్ద కథే ఉంది.!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.