పోషకాహార నిపుణులు, ఫిట్ నెస్ నిపుణులు రోజువారీ ఆహారంలో సాధారణంగా ట్రాన్స్ ఫ్యాట్స్ కు దూరంగా వుండాలని చెపుతారు. ఆరోగ్యం పట్ల శ్రధ్ధవహించేవారైన మీరు ఈ అంశం తెలుసుకోవటం ప్రధానం. ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి కూడా కొవ్వుల వంటివే కాని ఇవి సహజంగా మొక్కలు లేదా జంతువులనుండి వచ్చేవి కావు. ఇవి మనుషులచే తయారుచేయబడిన కృత్రిమ కొవ్వులు. కొవ్వులను దీర్ఘకాలం నిల్వ వుంచాల్సిన పదార్ధాలలో రూపాంతరం చెందించి వీటిలో వుంచుతారు.
ప్రాసెస్ చేసిన ఆహారాలు, అంటే, చిప్స్ మొదలైన వాటిలో ఇవి వుంటాయి. ఇవి తేలికగా దొరుకుతాయి కనుక కంపెనీలు వీటిని కొనుగోలు చేసి తమ ఉత్పత్తులు నిల్వ వుండేలా చేస్తారు. వీటిలో అధిక ఒత్తిడి కల హైడ్రోజన్ కణాలుంటాయి. గది ఉష్ణోగ్రతకు అవి గట్టిపడతాయి. ఈ చర్య కారణంగా వీటిని చెడు కొవ్వులని అంటారు. ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి?
చెడు కొవ్వు (ఎల్డిఎల్) పెంచి మంచి కొవ్వు (హెచ్ డి ఎల్) ను తగ్గిస్తాయి. గుండె ఆరోగ్యానికి హాని కలిగించే ట్రిగ్లీసెరైడ్స్ ను అధికం చేస్తాయి. గుండె రక్తనాళాలు ఉబ్బుతాయి. డయాబెటీస్ కూడా కలిగిస్తాయి. వీటిని దూరంగా వుంచటం ఎలా? ప్యాకేజ్డ్ ఆహారాల లేబుల్స్ పరిశీలించండి. వాటిపై జీరో ట్రాన్స్ ఫ్యాట్ అని వుండాలి. వీలైనంతవరకు వేయించిన ఆహారాలు తినకండి. ఇంటిలో తాజా నూనెతో చేసిన తిండ్లు తినండి. ప్యాకేజీలపై ట్రాన్స్ ఫ్యాట్ 0.5 గ్రాములవరకు వుంటే పరవాలేదు. ఫ్రెంచి ఫ్రైలు, పేస్ట్రీలు, పిజ్జాలు మొదలైన బేకరీ తిండ్లు తినకండి. వెన్న, నెయ్యి, ఇతర కొవ్వు పదార్ధాల కొనుగోలు జాగ్రత్తగా చేయండి. బ్రౌన్ రైస్, తాజా కూరల సలాడ్లు తీసుకోవడం మంచిది.