Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

ట‌మాటాల‌ను తింటే కిడ్నీ స్టోన్లు ఏర్ప‌డుతాయా ? ఇందులో నిజ‌మెంత ?

Admin by Admin
March 26, 2025
in అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న, వార్త‌లు
Share on FacebookShare on Twitter

మార్కెట్‌లో మ‌న‌కు సుల‌భంగా ల‌భించే అనేక ర‌కాల కూర‌గాయ‌ల్లో ట‌మాటాలు కూడా ఒక‌టి. వీటిని మ‌నం ఎంతో కాలంగా అనేక ర‌కాల వంట‌కాల్లో ఉప‌యోగిస్తున్నాం. వీటితో కూర‌లు, స‌లాడ్లు, చారు, సూప్స్‌, ఇత‌ర వంట‌కాలు చేసుకుంటారు. అయితే నిత్యం మ‌నం చేసుకునే ఏ కూర‌లో అయినా స‌రే ట‌మాటాలు ప‌డ‌క‌పోతే వాటికి స‌రైన రుచి రాదు. ఇక వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, విట‌మిన్లు, మిన‌ర‌ల్స్‌, ఫైబ‌ర్ వంటి మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాలు కూడా పుష్క‌లంగా ఉంటాయి. అందుక‌నే ట‌మాటాల‌ను నిత్యం మ‌నం వంట‌ల్లో వేస్తుంటాం. అయితే ట‌మాటాల‌ను తిన‌డం వ‌ల్ల కిడ్నీ స్టోన్లు ఏర్ప‌డుతాయ‌ని చాలా మంది అంటుంటారు. అన‌డ‌మే కాదు.. కొంద‌రు వైద్యులు కూడా ఇదే మాట చెబుతుంటారు. అయితే ఇంత‌కీ ఇందులో నిజ‌మెంత ఉంది ? నిజంగానే టామాటాల‌ను తిన‌డం వ‌ల్ల కిడ్నీ స్టోన్లు వ‌స్తాయా ? అంటే…

 

కిడ్నీ స్టోన్లు అనేవి నిజానికి రాత్రికి రాత్రే ఏర్ప‌డ‌వు. అవి ఏర్ప‌డేందుకు కొన్ని నెల‌లు లేదా సంవ‌త్స‌రాలు ప‌ట్ట‌వ‌చ్చు. కిడ్నీల్లో జ‌రిగే ప్రెసిపిటేష‌న్ అనే ప్ర‌క్రియ వ‌ల్ల కిడ్నీ స్టోన్లు ఏర్ప‌డుతాయి. స‌హ‌జంగా మ‌నం తినే ఆహారాల్లో ఉండే మిన‌ర‌ల్స్‌, ఆగ్జ‌‌లేట్స్‌, కాల్షియంలు కిడ్నీల్లోని యూరిక్ యాసిడ్‌తో క‌లిసి కిడ్నీ స్టోన్లుగా ఏర్ప‌డుతాయి. ఇందుకు కొన్ని నెల‌ల స‌మ‌యం ప‌డుతుంది. చిన్న చిన్న స్ఫ‌టికాలుగా రాళ్లు త‌యారై అవి రాను రాను పెద్ద సైజులోకి మారుతాయి. అప్పుడే వాటిని మ‌నం గుర్తిస్తాం. ఆ స‌మ‌యంలో రాళ్లు మూత్రాశ‌యానికి అడ్డుప‌డి మూత్రం రాకుండా చేస్తాయి. దీంతో విప‌రీత‌మైన, భరించ‌లేని నొప్పి క‌లుగుతుంది. అయితే ఒక‌సారి స్టోన్లు వ‌చ్చి తొల‌గిపోయిన వారికి మ‌ళ్లీ స్టోన్లు వ‌చ్చేందుకు అవ‌కాశం చాలా ఎక్కువ‌గా ఉంటుంద‌ని వైద్యులు చెబుతున్నారు.

ఇక ట‌మాటాల విష‌యానికి వ‌స్తే.. కిడ్నీ స్టోన్లు ఏర్ప‌డ‌కుండా ఉండాలంటే.. వాటిని తిన‌డం త‌గ్గించాల‌ని, లేదా పూర్తిగా మానేయాల‌ని చెబుతుంటారు. కానీ ఇది పూర్తిగా అపోహే. ఎందుకంటే.. నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డ‌యాబెటిస్ అండ్ డైజెస్టివ్ అండ్ కిడ్నీ డిసీజెస్ చెబుతున్న ప్ర‌కారం.. ట‌మాటాలే కాదు, ఆగ్జ‌లేట్స్ ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను వేటిని తిన్నా కిడ్నీ స్టోన్లు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. కానీ అది పూర్తిగా నిజ‌మూ కాదు. ఎందుకంటే.. కొంద‌రి శ‌రీరారాలు ఆహారాల్లో అధికంగా ఉండే ఆగ్జ‌లేట్ల‌ను ఎక్కువ‌గా శోషించుకునే స్వ‌భావాన్ని క‌లిగి ఉంటాయి. దీంతో అలాంటి వారికి కిడ్నీ స్టోన్లు వ‌స్తాయి. వారు ఆగ్జ‌లేట్లు ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తిన‌డం తగ్గించాలి. అంతేకానీ ఇత‌రులు ఆ ఆహారాల‌ను తిన‌డం మానేయాల్సిన ప‌నిలేదు. ట‌మాటాలైనా, ఇత‌ర ఆగ్జ‌లేట్లు ఉన్న ఆహారాలు ఏవైనా స‌రే.. ఆరోగ్య‌వంత‌మైన వ్య‌క్తులు ఎలాంటి భ‌యం లేకుండా తిన‌వ‌చ్చు. కానీ కిడ్నీ స్టోన్ల స‌మ‌స్య ఉన్న‌వారు మాత్రం అలాంటి ఆహారాల‌కు దూరంగా ఉండాలి. అలాగే ఆ స‌మ‌స్య వ‌చ్చి త‌గ్గిన వారు కూడా ఆయా ఆహారాల‌ను తిన‌డం త‌గ్గించాలి. లేదా వాటికి పూర్తిగా దూరంగా ఉండాలి. దీంతో కిడ్నీ స్టోన్లు మ‌ళ్లీ రాకుండా చూసుకోవ‌చ్చు.

కాగా అధిక బ‌రువు ఉన్న‌వారు, డ‌యాబెటిస్‌, హైబీపీ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డేవారు కూడా ఆగ్జ‌లేట్స్ ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌కు దూరంగా ఉండాల‌ని వైద్యులు చెబుతున్నారు. వారిలో కిడ్నీ స్టోన్లు ఏర్ప‌డేందుకు అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ని అంటున్నారు.

ఇక ప‌లువురు సైంటిస్టులు చేప‌ట్టిన అధ్య‌య‌నాల ప్ర‌కారం.. కిడ్నీ స్టోన్ల స‌మ‌స్య లేని, ఆరోగ్య‌వంత‌మైన వ్య‌క్తులు ట‌మాటాల‌ను తిన‌డం వ‌ల్ల కిడ్నీ స్టోన్లు రాకుండా ఉంటాయ‌ని.. తేలింది. క‌నుక అస‌లు కిడ్నీ స్టోన్లు ఏర్ప‌డ‌ని వారు నిరభ్యంత‌రంగా, ఎలాంటి భ‌యం లేకుండా వాటిని రోజూ తిన‌వ‌చ్చు. కానీ కిడ్నీ స్టోన్లు ఒక‌సారి ఏర్ప‌డి తొల‌గిపోయినా, ప‌దే ప‌దే స్టోన్లు వ‌స్తున్నా.. అలాంటి వారు మాత్రం ఆగ్జ‌లేట్లు, కాల్షియం వంటి ప‌దార్థాలు ఎక్కువ‌గా ఉండే ట‌మాటాలు, పాల‌కూర‌, న‌ట్స్‌, బీట్‌రూట్‌, చాకొలేట్‌, టీ, సోయా వంటి ఆహారాల‌ను తీసుకోరాద‌ని సూచిస్తున్నారు. వాటిని వీలైనంత వ‌ర‌కు త‌గ్గించి తీసుకోవ‌డ‌మో లేదా పూర్తిగా మానేయ‌డ‌మో చేయాల‌ని అంటున్నారు. లేదంటే స‌మ‌స్య ఇంకా తీవ్ర‌మ‌య్యే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Tags: kidney stoteskidneys lo rallumutrapindallo rallutomatoes
Previous Post

స‌ముద్ర‌పు చేప‌ల‌ను త‌ర‌చూ తినాల్సిందే.. ఎందుకంటే..?

Next Post

ప‌న‌స పండు.. పోష‌కాలు మెండు.. త‌ర‌చూ తింటే ఎన్నో లాభాలు..!

Related Posts

వినోదం

పాచువుమ్ అద్భుత విలక్కుమ్.. సామాన్య ప్ర‌జ‌ల జీవితాల‌కు ప్ర‌తిబింబిం ఈ సినిమా..

May 30, 2025
inspiration

ధోతి కట్టుకుంటే అవమానించారని. అదే వ్యాపారం చేసి వేల కోట్లు సంపాదించాడు.. ఈయన సక్సెస్ స్టోరీ ఇది..

May 30, 2025
food

పెరుగు లేకుండా పాలు ఎలా తోడు పెట్టాలి?

May 30, 2025
ఆధ్యాత్మికం

తిరుపతిలో భోజనం ఎక్కడ బాగుంటుంది?

May 29, 2025
international

దావూద్ ఇబ్ర‌హీంను భార‌త ఇంటెలిజెన్స్ అధికారులు చంప‌కుండా ఆపిన అదృశ్య శ‌క్తి ఎవ‌రు..?

May 29, 2025
హెల్త్ టిప్స్

ఈ సీజ‌న్ లో మీరు క‌చ్చితంగా నిమ్మ‌కాయ నీళ్ల‌ను తాగాలి.. ఎందుకంటే..?

May 29, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
హెల్త్ టిప్స్

ఒక చెంచా నెయ్యితో రోజును ప్రారంభిస్తే వారం రోజుల్లో జరిగే మిరాకిల్స్ ఇవే.. మీరు ఊహించి ఉండరు..

by Admin
May 23, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
మొక్క‌లు

Ranapala : ఈ మొక్క ఆకుల‌ను ప‌ర‌గ‌డుపునే తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..? ఎక్క‌డ క‌నిపించినా విడిచిపెట్ట‌కండి..

by D
December 15, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!