Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

గ‌ర్భిణీల‌కు నిద్ర స‌రిగ్గా ప‌ట్ట‌దు.. ఈ చిట్కాల‌ను పాటిస్తే ఈ స‌మ‌స్య‌ను తొల‌గించుకోవ‌చ్చు..!

Admin by Admin
February 21, 2025
in హెల్త్ టిప్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

గర్భవతిగా ఉన్నప్పుడు మహిళలు మంచి నిద్రను పొందలేకపోతుంటారు. నెలలు దాటే కొద్ది నిద్ర ఒక సవాలుగా మారుతుంది. గర్భంలో పిండాశయం పెరిగే కొద్ది గర్భిణులు తక్కువగా నిద్ర పోతుంటారు. కడుపులో పిండం పెరగడం వల్ల పడుకోలేని పరిస్థితి నెలకొంటుంది. గర్భిణులు మంచి నిద్రను పొందాలనుకుంటే తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి. గర్భం చివరి దశలో ఉన్నప్పుడు శిశువు గర్భం లోపల కదులుతూ ఉంటుంది. దీంతో నిద్రకు భంగం వాటిల్లుతుంది. లోపల ఉన్న బిడ్డ కదిలినప్పుడు ఆటోమెటిక్ గా నిద్ర లేస్తారు. మళ్లీ పడుకోవడానికి ట్రై చేసినా నిద్ర పట్టదు. సహజంగా గర్భిణులు మానసిక ఒత్తిడికి లోనవుతారు. నార్మల్ డెలివరీ.. సీజిరియన్ అవుతుందనే ఆందోళన. బిడ్డ అడ్డం తిరుగుతుంద‌నే భయం.. ఇలా అన్ని సమస్యలతో సతమతం అవుతుంటారు.

గర్భవతిగా ఉన్నప్పుడు వారి కాళ్లు తిమ్మిరెక్కడం సహజం. కొందరి కాళ్లు వాపుగా కనిపిస్తాయి. ఇలా కాలు తిమ్మిరెక్కినప్పుడు కూడా నిద్రకు భంగం వాటిల్లుతుంది. తరచూ మూత్ర విసర్జన సమస్య కూడా ఉంటుంది. చివరి దశలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. మానసిక ఒత్తిడికి లోనైనప్పుడు టీ, కాఫీ లాంటివి తాగేస్తుంటారు. వీలైనంత వరకు వాటిని దూరం పెట్టాలి. ఆహారపు అలవాట్లు కూడా ఓ సమస్యే. అందుకే ఒకేసారి తినకుండా కొంచెం కొంచెంగా తింటూ ఉండాలి. హార్మోన్ల ప్రభావం.. మానసిక ఒత్తిడి కారణంగా రాత్రి పూట ప్రశాంతమైన నిద్ర పొందలేరు. కాబట్టి గర్భిణులు కొన్ని చిట్కాలను పాటించాల్సి ఉంటుంది.

pregnant women do not have sleep follow these remedies

ప‌డుకునే ముందు వేడి పాలను తాగండి. ఆరోగ్యంతోపాటు నిద్రకు మేలు చేస్తుంది. పిండి పదార్థాలను ఎక్కువగా తినండి. తీసుకునే ఆహారంలో ప్రోటీన్లు అధికంగా ఉండేలా చూసుకోండి. పగటి పూట ఆరోగ్యకరమైన చిరుతిండి.. రాత్రి పూట పండ్లు, లైట్ ఫుడ్ తీసుకోండి. వీలైనంత వరకు ఆహారాన్ని ద్రవరూపంలోనే తీసుకోండి. గర్భ సమయంలో పిల్లలకు నీరు ఎంతో అవసరం. బిడ్డకు కావాల్సిన ఎనర్జీ కూడా ద్రవ రూపంలోనే చేరుతుంది. ఒత్తిడిని తగ్గించుకునేందుకు తేలికపాటి యోగాసనాలు చేయండి. అప్పుడు మానసిక ఒత్తిడి నుంచి దూరమవుతారు. అలాగే పడుకోవడానికి ప్రత్యేక షెడ్యూల్ పాటించండి. టైం కేటాయించుకుని పడుకోవడం అలవాటు చేసుకోండి. కాళ్లు తిమ్మిరెక్కినప్పుడు తాపన ప్యాడ్ లేదా వేడి నీటి సంచిని నొప్పి ఉన్న ప్రదేశాల్లో ఉంచండి. రోజూ వెచ్చని స్నానం చేయండి. ప్రశాంతంగా ఉంటూ.. మీకు నచ్చిన పని చేయండి. అప్పుడు మీకు హాయిగా నిద్ర పడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.

Tags: pregnant women
Previous Post

ఈ ఒక్క టీ ని రోజూ తాగితే చాలు.. ఎంతో మేలు జ‌రుగుతుంది..!

Next Post

మీ పిల్ల‌లు స‌రిగ్గా నిద్ర‌పోవ‌డం లేదా.. పీడ‌క‌ల‌లు వ‌స్తున్నాయా..? ఇలా చేయండి..!

Related Posts

చిట్కాలు

ఈ చిట్కాల‌ను పాటిస్తే క‌ళ్ల కింద ఉండే డార్క్ స‌ర్కిల్స్ దెబ్బ‌కు మాయం అవుతాయి..!

June 14, 2025
చిట్కాలు

మీ ముఖంపై ఉండే ముడ‌త‌లు పోయి అందంగా క‌నిపించాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

June 14, 2025
హెల్త్ టిప్స్

పొట్ట ద‌గ్గరి కొవ్వు క‌ర‌గాల‌ని చూస్తున్నారా.. అయితే వీటిని తాగండి..

June 14, 2025
information

అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా A171 విమాన ప్రమాదం.. మేడే కాల్ అంటే ఏంటి?

June 14, 2025
technology

గూగుల్ వంటి పెద్ద కంపెనీలలో వాడి పడేసిన పాత కంప్యూటర్లను ఏమి చేస్తారు?

June 14, 2025
హెల్త్ టిప్స్

ఒక‌టే ప‌టిక‌.. ఎన్నో ఉప‌యోగాలు..!

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!