Candle : ఏదైనా ఒక విషయం మీద దృష్టి కేంద్రీకృతం అవ్వట్లేదా ? మతిమరుపు పెరిగిపోతుందా ? చదివింది గుర్తుండడం లేదా ? ఇలాంటి సమస్యలకు చక్కటి పరిష్కారం క్యాండిల్ ట్రిక్. దీనిని మీ పిల్లలతో రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయిస్తే మీ పిల్లల మెమొరీలో గుణాత్మకమైన మార్పు వస్తుంది. చదువులో కూడా మీ పిల్లలు గతంతో పోల్చితే మెరుగవుతారు. అయితే దీన్ని పిల్లలే కాదు.. పెద్దలు కూడా పాటించవచ్చు. దీంతో మతిమరుపు సమస్య తగ్గుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అయితే ఇందుకు ఏం చేయాలంటే..
ఉదయం నిద్ర లేవగానే పద్మాసనంలో కూర్చొని కొద్ది దూరంలో సరిగ్గా మన కంటికి సమానమైన దిశలో ఓ వెలుగుతున్న కొవ్వొత్తిని చూస్తూ ఉండాలి. మారుతున్న దాని మంట రంగు, గాలికి కదులుతూ తన షేప్ ను మార్చుకుంటున్న తీరును కూడా ఓ 5 నిమిషాల పాటు తదేకంగా పరిశీలిస్తూ ఉండాలి. ఆ తర్వాత ఆ వెలుగుతున్న కొవ్వొత్తిని ఆర్పివేసి ఇప్పుడు కళ్లు మూసుకొని ఇంతకు ముందులా కొవ్వొత్తి వెలుగుతున్నట్టు మనో నేత్రంతో చూడాలి (ఊహించుకోవాలి).
ఇలా ప్రతిరోజు చూస్తూ ఉండాలి. అయితే మొదటి రోజు 5 నిమిషాల పాటు వెలుగుతున్న కొవ్వొత్తిని చూస్తే క్రమంగా ఆ సమయాన్ని తగ్గించుకుంటూ పోవాలి. ఇలా చేయడం వల్ల జ్ఞాపకశక్తితోపాటు ఊహాశక్తి కూడా అమాంతం పెరుగుతుంది. దీంతో చిన్నారులలో మెదడు వికసిస్తుంది. త్వరగా పాఠ్యాంశాలను నేర్చుకుంటారు. చదువుల్లోనూ రాణిస్తారు. ఇక పెద్దల్లో వచ్చే మతిమరుపు సమస్యకు చెక్ పెట్టవచ్చు.