Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వార్త‌లు

Soaked Almonds : ఈ 10 లాభాల గురించి తెలిస్తే నాన‌బెట్టిన బాదంప‌ప్పుల‌ను ఇప్పుడే తిన‌డం మొద‌లు పెడ‌తారు..!

D by D
January 22, 2024
in వార్త‌లు, హెల్త్ టిప్స్
Share on FacebookShare on Twitter

Soaked Almonds : మ‌నం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో బాదంప‌ప్పు కూడా ఒక‌టి. బాదంప‌ప్పు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. అనేక ర‌కాల తీపి వంట‌కాల త‌యారీలో కూడా బాదంపప్పును వాడుతూ ఉంటాము. బాదంప‌ప్పులో అనేక ర‌కాల పోష‌కాలు ఉంటాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. అయితే వీటిని నేరుగా తీసుకోవ‌డానికి బ‌దులుగా ఈ బాదంప‌ప్పును నాన‌బెట్టి వాటిపై ఉండే పొట్టును తీసేసి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి మరింత మేలు క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. నాన‌బెట్టిన బాదంప‌ప్పుల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. స‌మ‌తుల్య‌మైన ఆహారాన్ని తీసుకోవాల‌నుకునే వారు బాదంప‌ప్పును ఆహారంగా తీసుకోవ‌డం చాలా ముఖ్యం. బాదంప‌ప్పును నాన‌బెట్టి తీసుకోవ‌డం వ‌ల్ల వాటిలో ఉండే విష ప‌దార్థాలు పూర్తిగా తొల‌గిపోతాయి.

అలాగే ఇవి సుల‌భంగా జీర్ణ‌మ‌వుతాయి. బాదంప‌ప్పును నాన‌బెట్టి తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ‌క్రియ మెరుగుప‌డుతుంది. జీర్ణ‌క్రియ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు ప‌చ్చిబాదంప‌ప్పును తిన‌డానికి బ‌దులుగా ఇలా నాన‌బెట్టి తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. అలాగే వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. వీటిలో ఉండే ఫైబ‌ర్ మ‌న‌కు క‌డుపు నిండిన భావ‌న‌ను క‌లిగించడంలో స‌హాయ‌ప‌డుతుంది. దీంతో మనం ఆరోగ్యంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. అలాగే బాదంపప్పులో మోనోఅన్ శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. ఇక నాన‌బెట్టిన బాదంప‌ప్పుల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. వీటిని ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల మ‌ధుమేహ వ్యాధి గ్ర‌స్తుల‌కు ఎంతో మేలు క‌లుగుతుంది. అంతేకాకుండా బాదంప‌ప్పులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి.

Soaked Almonds know about these 10 health benefits
Soaked Almonds

ఇవి క‌ణాల ఆక్సీక‌ర‌ణ ఒత్తిడిని త‌గ్గించడంలో స‌హాయ‌ప‌డ‌తాయి. దీంతో మ‌నం అనేక దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌కుండా ఉంటాము. అలాగే బాదంపప్పులో విట‌మిన్ ఇ ఎక్కువ‌గా ఉంటుంది. ఇది చ‌ర్మ ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. అలాగే బాదంపప్పులో బ‌యోటిన్ మ‌రియు ఎసెన్షియ‌ల్ ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్ల‌ను బ‌లంగా త‌యారు చేయ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. ఈ విధంగా నాన‌బెట్టిన బాదంప‌ప్పును తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని అంద‌రూ వీటిని ఆహారంలో భాగంగా తీసుకునే ప్ర‌య‌త్నం చేయాల‌ని నిపుణులు చెబుతున్నారు.

Tags: soaked almonds
Previous Post

Karivepaku Kodi Vepudu : క‌రివేపాకు కోడి వేపుడు ఇలా చేయండి.. రుచి చూస్తే ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు..!

Next Post

Kattu Charu : క‌ట్టు చారును ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Related Posts

మొక్క‌లు

డ‌యాబెటిస్ ఉన్న‌వారికి వ‌రం ఈ మొక్క‌.. ఎంతో మేలు చేస్తుంది..!

July 4, 2025
హెల్త్ టిప్స్

రోజూ వీటిని తినండి.. మీ ఆయుష్షు ఎంత‌గానో పెరుగుతుంది..!

July 4, 2025
హెల్త్ టిప్స్

మిరియాల‌ను రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాల్సిందే.. ఎందుకంటే..?

July 4, 2025
ఆధ్యాత్మికం

కుంభ మేళాకు నాగ‌సాధువులు ల‌క్షలాదిగా ఒకేసారి వ‌చ్చి ఎలా వెళ్తారు..?

July 4, 2025
Off Beat

స‌హాయం చేసే వారంద‌రూ స్నేహితులు కారు.. గొప్ప క‌థ‌..!

July 4, 2025
mythology

ఫినిక్స్ పక్షి ప్రత్యేకత ఏమిటి ? ఇది వాస్తవంగా గతంలో మనుగడలో వుండిందా ? లేదా ఇదంతా కేవలం కాల్పానికమేనా ?

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.