Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

మ‌ధుమేహం, జీర్ణ‌స‌మ‌స్య‌లు, అధిక బ‌రువు, వేడికి చ‌క్క‌ని ప‌రిష్కారం… బార్లీ నీరు..!

Admin by Admin
March 10, 2025
in హెల్త్ టిప్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

బార్లీ గింజ‌లు. చూడడానికి ఇవి అచ్చం గోధుమ గింజ‌ల్లాగే ఉంటాయి. కానీ… అవి చేసే మేలు చెప్ప‌లేం. బార్లీ గింజలు ఆరోగ్యానికి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వీటిలో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన కీల‌క పోష‌కాలు ఉన్నాయి. కొవ్వును అదుపులో ఉంచి, బరువు తగ్గాలనుకునేవారికి బార్లీ మంచి పరిష్కారం. బార్లీ నీరు తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలుంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అనేక అనారోగ్యాలను దూరం చేస్తే శక్తి ఇందులో ఉందని అంటున్నారు. ఆయుర్వేదంలో బార్లీ గింజ‌ల‌కు ప్ర‌త్యేక స్థానం ఉంది. ప‌లు రోగాల‌ను న‌యం చేయ‌డానికి వీటిని వాడుతారు. బార్లీ వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఒక పాత్రలో లీటరు మంచినీటిని తీసుకొని, అందులో గుప్పెడు బార్లీ గింజలను వేయాలి. 20 నిమిషాలపాటు ఈ నీటిని బాగా మరిగించాలి. దీంతో బార్లీ గింజలు మెత్తగా మారి, వాటిలోని పోషకాలన్నీ నీటిలోకి చేరతాయి. తర్వాత ఆ నీటిని చల్లార్చి కొద్దిగా నిమ్మరసం లేదా తేనె కలుపుకోవాలి. ఈ నీటిని నిత్యం ఉదయాన్నే పరగడుపున తాగాలి. ఇలా బార్లీ నీటిని తాగ‌డం వ‌ల్ల కింద చెప్పిన అద్భుత ఫ‌లితాలు క‌లుగుతాయి. చిన్నపిల్లలకు బార్లీ నీటిని తాగించడం వల్ల మూత్రం చెడువాసన రాదు. బార్లీ నీటిని పరగడుపునే తాగితే శరీరంలోని వ్యర్థ, విష పదార్థాలన్నీ మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతాయి. పెద్ద పేగు శుభ్రప‌డి కోలన్ క్యాన్సర్ రాకుండా ఉంటుంది.

take barley water daily for many wonderful health benefits

హార్మోన్లకు సంబంధించిన చికిత్స తీసుకుంటున్నవారు బార్లీ నీటిని తాగితే ఉపశమనం లభిస్తుంది. హార్మోన్లు చ‌క్క‌గా ప‌నిచేస్తాయి. తిన్న ఆహారం గొంతులోకి వచ్చినట్లుగా ఉండేవారికి బార్లీ నీరు మంచి ఫలితాలనిస్తుంది. కడుపులో మంట, అసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలు దూరమవుతాయి. జీర్ణ సంబంధ స‌మ‌స్య‌లు పోయి జీర్ణాశ‌యం శుభ్ర‌మ‌వుతుంది. వేడి చేసినవారు బార్లీ నీటిని తాగడం ద్వారా ఉపశ‌మ‌నం పొందవచ్చు. ప్ర‌ధానంగా ఎండాకాలంలో ఈ నీరు బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. బార్లీ నీటిలో సహజసిద్ధంగా ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాల వల్ల కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి. బార్లీలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

బరువు తగ్గాలనుకునేవారికి బార్లీ నీరు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే పోషకాలు శరీర మెటబాలిజాన్ని క్రమబద్ధీకరిస్తాయి. దీంతో బరువు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మధుమేహం ఉన్నవారు బార్లీ నీటిని తాగడం చాలా మంచిది. ఇందులో ఉండే బీటా గ్లూకాగాన్ గ్లూకోజ్ గ్రహించడాన్ని ఆలస్యం చేస్తుంది. దీని వల్ల రక్తంలో చక్కెర నిల్వలు పెరిగే అవకాశం తగ్గుతుంది. శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. దీని వల్ల గుండె సంబంధిత వ్యాధులు ద‌రిచేరవు. బీపీ కూడా అదుపులో ఉంటుంది. బార్లీ నీటికి కిడ్నీలో రాళ్లను కరిగించే శక్తి ఉంది. మూత్రాశ‌య సంబంధ స‌మ‌స్య‌లు కూడా పోతాయి. గర్భవతులు బార్లీనీటిని తాగితే మూత్రాశయ సంబంధ సమస్యలు తొలగిపోతాయి. బాలింతలకు బార్లీ నీటిని తాగిస్తే పాలు బాగా పడతాయి. జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుంది.

Tags: barley water
Previous Post

నూడుల్స్‌ను ఎక్కువ‌గా తిన‌వ‌ద్దంటారు, కొరియా, చైనా, జ‌పాన్ వాసులు ఎలా తింటున్నారు..?

Next Post

అధిక బ‌రువు, డిప్రెష‌న్‌, కీళ్ల నొప్పులు, జీర్ణ స‌మ‌స్య‌ల‌కు చ‌క్క‌ని ప‌రిష్కారం… స‌బ్జా గింజ‌లు..!

Related Posts

lifestyle

కేజీ ప‌ల్లీల ధ‌ర రూ.180, ప‌ల్లి నూనెను కేజీకి రూ.150కి ఎలా అమ్ముతున్నారు..?

July 1, 2025
Home Tips

మీ ఫ్రిజ్ నుంచి దుర్వాస‌న వ‌స్తుందా.. అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

July 1, 2025
ఆధ్యాత్మికం

మీకు ఇలాంటి క‌ల‌లు వ‌స్తున్నాయా..? అయితే మీ స‌మస్య‌లు త్వ‌ర‌లో పోతాయ‌ని అర్థం..!

July 1, 2025
పోష‌ణ‌

ఈ ఒక్కటి తింటే చాలు ఈ కాలంలో సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు..!!

July 1, 2025
technology

WI-FI రూటర్ వేగానికి చిన్న ట్రిక్స్.. రెప్పపాటులో హెచ్‌డీ వీడియోలు డౌన్‌లోడ్

July 1, 2025
హెల్త్ టిప్స్

మద్యం సేవిస్తున్న సాయంలో పొరపాటున కూడా తినకూడని 5 పదార్థాలు ! మీ ఆరోగ్యానికే ముప్పు జాగ్రత్త !

July 1, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.