Garlic Cloves : ప్రతి ఒక్కరు కూడా, ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటుంటారు. చాలా రకాల సమస్యలు ఈ రోజుల్లో కలుగుతున్నాయి. ఎక్కువమంది, ఎముకల సమస్యలతో కూడా బాధపడుతున్నారు. ఎముకలు అరిగిపోవడం, విరిగిపోవడం లేదంటే బలహీనమైన ఎముకలు ఇలా రకరకాల బాధలతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి సమస్యలు ఏమి లేకుండా ఉండాలంటే, కాల్షియం సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. అలానే, మినరల్స్ సరిగ్గా అందితే కూడా ఎముకల బాధలు ఉండవు. ఎముకలు సమస్యలు వంటివి తగ్గించడానికి వెల్లుల్లి బాగా పనిచేస్తుంది.
వెల్లుల్లితో ఈ సమస్యల నుండి బయటపడవచ్చు. వెల్లుల్లిలో సల్ఫర్ కాంపౌండ్స్ ఎక్కువ ఉంటాయి. వెల్లుల్లిపాయలులో ఘాటు కూడా ఉంటుంది. వెల్లుల్లి ఎముకలకి బాగా ఉపయోగపడగలదు. బోన్స్ లోపలికి బోన్ సెల్స్ లోపలికి కాల్షియం ని ఫాస్ఫరస్ ని పంపడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ సల్ఫర్ కాంపౌండ్స్ వెల్లుల్లి లో ఉంటాయి కాబట్టి ఎముకలు సమస్యలు ఏమి కూడా ఉండవు.
క్యాల్షియం ఎముకలకి పట్టాలంటే సల్ఫర్ కాంపౌండ్స్ నుండి అలసిన్ బాగా ఎక్కువ సపోర్ట్ చేస్తుంది. ఎముకలు బాగా ఆరోగ్యంగా అవ్వడానికి వెల్లుల్లి హెల్ప్ చేస్తుంది. వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువ ఉంటాయి. ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని కూడా తగ్గిస్తుంది. వెల్లుల్లిని మనం రకరకాలుగా వంటల్లో వేసుకుని తీసుకోవచ్చు.
ఈజీగానే మనం వెల్లుల్లి వంటల్లో వాడుకోవచ్చు. కాబట్టి రెగ్యులర్ గా రకరకాల వంటల్లో వేసుకుని, తీసుకుని లాభాలు అన్నిటిని కూడా పొందవచ్చు. ముఖ్యంగా ఎముకల బాధలు ఉన్నవాళ్లు, వెల్లుల్లిని కచ్చితంగా వంటల్లో చేర్చుకోవడం మంచిది. వెల్లుల్లి నూరి మసాలా పేస్ట్ లాగ ఉడికించేటప్పుడు వేస్తే, అసలు కెమికల్ కాంపౌండ్స్ దెబ్బతినవు. ఇలా, వాడుకోవడానికి అభ్యంతరం లేకపోతే ఈ విధంగా మీరు వాడుకోవచ్చు.