Raisins Curd : పెరుగును తినడం వల్ల మనకు ఎన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. అలాగే కిస్మిస్‌లను కూడా చాలా మంది ఇష్టంగా తింటుంటారు. అయితే ఈ రెండింటినీ కలిపి రోజూ తినడం వల్ల మనకు ఇంకా ఎక్కువ లాభాలు కలుగుతాయి. శరీరానికి అనేక పోషకాలు లభిస్తాయి. వీటిని కలిపి తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
రాత్రి పూట పాలను మరిగించాక చల్లార్చి అందులో తోడు వేసే సమయంలో 10 నుంచి 12 కిస్మిస్‌లను వేయాలి. ఒక చిన్న పాత్రలోని పాలకు 10 కిస్మిస్‌ల చొప్పున వేసి కలపాలి. తరువాత తోడు పెట్టాలి. దీంతో తెల్లారే సరికి కిస్మిస్‌లతో కూడిన పెరుగు తయారవుతుంది. దీన్ని ఉదయం బ్రేక్‌ఫాస్ట్ లేదా మధ్యాహ్నం భోజనంతో కలిపి తీసుకోవచ్చు. దీన్ని తినడం వల్ల మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి.
1. ఈ విధంగా కిస్మిస్‌లతో పెరుగును తయారు చేసుకుని తింటే పురుషులకు ఎంతగానో మేలు జరుగుతుంది. వారిలో వీర్యం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీంతో సంతాన లోపం సమస్య నుంచి బయట పడవచ్చు. అలాగే టెస్టోస్టిరాన్ హార్మోన్ పెరుగుతుంది. దీంతో పురుషుల్లో శృంగార సామర్థ్యం పెరుగుతుంది. ఈ విధంగా కిస్మిస్, పెరుగు మిశ్రమం పురుషులకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
2. కిస్మిస్, పెరుగు మిశ్రమాన్ని రోజూ తినడం వల్ల హైబీపీ తగ్గుతుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు.
3. తరచూ ఈ మిశ్రమాన్ని తీసుకుంటే శరీరంలోని వాపులు తగ్గుతాయి. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి.
4. శరీరంలో బాగా నీరసంగా.. శక్తి లేనట్లు అనిపించేవారు ఈ మిశ్రమాన్ని ఉదయాన్నే తీసుకుంటే రోజంతా ఉత్సాహంగా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు. శక్తి బాగా లభిస్తుంది. ఇది రోజూ శారీరక శ్రమ ఎక్కువగా చేసే వారికి, వ్యాయామం చేసేవారికి కూడా ఎంతగానో మేలు చేస్తుంది. వారికి శక్తి బాగా అందుతుంది.
5. వేసవిలో మన శరీరం వేడిగా మారుతుంది. కానీ ఈ మిశ్రమాన్ని తింటే చలువ చేస్తుంది. వేడి మొత్తం తగ్గుతుంది. అలాగే జీర్ణ సమస్యలు తగ్గుతాయి. మలబద్దకం, గ్యాస్ ఉండవు.