Ayurvedic Herbs : చక్కటి ఆరోగ్యంతో, శ్రేయస్సుతో జీవించాలని అందరూ కోరుకుంటారు. చక్కటి ఆరోగ్యం కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చక్కటి ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు. జీవనశైలిలో అనేక మార్పులు చేసుకుంటారు. అలాగే అనేక రకాల మందులను, ఆయుర్వేద మూలికలను కూడా వాడుతూ ఉంటారు. అయితే మందులకు బదులుగా ఎటువంటి దుష్ప్రభావాలు లేని ఆయుర్వేద మూలికలను వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఆయుర్వేద మూలికలను వాడడం వల్ల మన శరీర ఆరోగ్యంతో పాటు జీవిత కాలం కూడా పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మన జీవితకాలాన్ని అలాగే శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆయుర్వేద మూలికల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శరీర ఒత్తిడిని తగ్గించి, జీవక్రియను మెరుగుపరచడంలో అశ్వగంధ మనకు ఎంతగానో సహాయపడుతుంది.
అశ్వగంధను తీసుకోవడం వల్ల ఆరోగ్యం ఎంతగానో మెరుగుపడుతుంది. అలాగే తులసిని తీసుకోవడం వల్ల కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. దీనిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ ప్లామటరీ గుణాలు శరీర ఆరోగ్యాన్ని, జీవితకాలాన్ని పెంచడంలో మనకు దోహదపడతాయి. జీవశక్తిని, శరీర ధృడత్వాన్ని పెంచడంలో మనకు షిలాజిత్ ఎంతో సహాయపడుతుంది. దీనిలో ఉండే మినరల్స్, ఖనిజాలు, ఫుల్విక్ యాసిడ్ శరీర ఆరోగ్యాన్ని, శ్రేయస్సును పెంచడంలో దోహదపడతాయి. అలాగే ఉసిరికాయలను తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. వీటిలో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి వయసు పైబడడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడతాయి. ఇక శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో తిప్పతీగ మనకు ఎంతో తోడ్పడుతుంది.
శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచి రోగాలు దరి చేరకుండా కాపాడడంలో తిప్ప తీగ మనకు సహాయపడుతుంది. అలాగే దీర్ఘాయువును అందించే మొక్కలల్లో సరస్వతి ఆకు కూడా ఒకటి. మెదడు పనితీరును మెరుగుపరచడంలో, మానసిక ఆరోగ్యాన్ని అందించడంలో ఈ మొక్క మనకు సహాయపడుతుంది. అలాగే బ్రహ్మి మొక్కను ఉపయోగించడం వల్ల కూడా శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది. అభిజ్ఞా పనితీరును, జ్ఞాపకశక్తిని పెంచడంలో, శరీరానికి బలాన్ని చేకూర్చడంలో బ్రహ్మి మొక్క మనకు దోహదపడుతుంది. అదే విధంగా మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో రేగుట మొక్క కూడా ఎంతో ఉపయోగపడుతుంది. దీనిలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. జీవశక్తిని పెంచడంలో ఈ రేగుట మొక్క మనకు దోహదపడుతుంది. ఈ విధంగా ఈ మూలికలను తీసుకోవడం వల్ల శరీర ఆరోగ్యంతో పాటు దీర్ఘాయువును కూడా సొంతం చేసుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.