Dry Fruits : ప్రతి ఒక్కరు కూడా, ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తీసుకోవాలని చూస్తూ ఉంటారు. ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలని కనుక మనం తీసుకున్నట్లయితే, ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుండడం కోసం, డ్రై ఫ్రూట్స్ ని చాలామంది తీసుకుంటూ ఉంటారు. రకరకాల నట్స్ మనకి అందుబాటులో ఉంటాయి. వాటిని, తీసుకోవడం వలన ఆరోగ్య ప్రయోజనాలను ఎన్నో పొందవచ్చు. ఈరోజు నట్స్ గురించి, నట్స్ తాలూకా ప్రయోజనాల గురించి చూసేద్దాం. బాదం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. బాదం లో విటమిన్ ఈ తో పాటుగా యాంటీ ఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు ఉన్నాయి.
బాదం ని తీసుకోవడం వలన, గుండె ఆరోగ్యం కూడా బాగుంటుంది. బ్రెయిన్ ఫంక్షన్ కూడా బాగుంటుంది. చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. వాల్నట్స్ లో కూడా, పోషకాలు బాగా ఎక్కువగా ఉంటాయి. వాల్నట్స్ ని తీసుకోవడం వలన, బ్రెయిన్ ఫంక్షన్ బాగుంటుంది. ఇంఫ్లమేషన్ కూడా తగ్గుతుంది. కాబట్టి, రెగ్యులర్ గా వాల్నట్స్ తీసుకోవడం మంచిది. అలానే, జీడిపప్పులో ఉండే పోషకాల గురించి చూస్తే.. జీడిపప్పు లో ఐరన్ ఎక్కువ ఉంటుంది.
మెగ్నీషియం, జింక్ కూడా ఉంటాయి. ఎముకల ఆరోగ్యాన్ని పెంపొందించడానికి జీడిపప్పు ఉపయోగపడుతుంది. ఇమ్యూన్ ఫంక్షన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఎనర్జీ కూడా బాగా వస్తుంది. ఖర్జూర పండ్లు తీసుకుంటే, ఫైబర్, పొటాషియంతో పాటుగా నాచురల్ షుగర్స్ అందుతాయి. అలానే, ఖర్జూరం తీసుకోవడం వలన, అజీర్తి సమస్యలకు దూరంగా ఉండొచ్చు. బీపీ కూడా కంట్రోల్ లో ఉంటుంది. శక్తిని పొంది ఆరోగ్యంగా ఉండవచ్చు. ఎండు ద్రాక్ష కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
ఎండు ద్రాక్షలో కూడా పోషకాలు బానే ఉంటాయి. ఎండుద్రాక్షలో ఐరన్, పొటాషియంతో పాటు ఇతర సమస్యలను తొలగించడానికి కూడా అవుతుంది. చర్మ ఆరోగ్యానికి కూడా ఇది మేలు చేస్తుంది. అంజీర్ కూడా బాగా మేలు చేస్తుంది. అంజీర్ ని తీసుకోవడం వలన అజీర్తి సమస్యలు తొలగిపోతాయి. ఎముకలు దృఢంగా ఉంటాయి.
బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి. ఆప్రికాట్స్ ని తీసుకోవడం వలన విటమిన్ ఏ, పొటాషియం అందుతాయి. అలానే, కంటి ఆరోగ్యానికి, అజీర్తి సమస్యలను దూరం చేయడానికి కూడా అప్రికాట్ బాగా ఉపయోగపడుతుంది. పిస్తా తో కూడా, గుండె సమస్యలకి చెక్ పెట్టవచ్చు. అజీర్తి సమస్యలు వుండవు. చర్మం కూడా బాగుంటుంది. ఇలా ఈ నట్స్ తో, ఇన్ని సమస్యలకి దూరంగా ఉండవచ్చు.