Wheat Dosa : మనలో చాలా మంది ఉదయం పూట ఏ అల్పాహారం చేయాలా అని సతమతమవుతూ ఉంటారు. అలాగే ఉదయం పూట కొందరికి సమయం తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా కొందరికి రోజూ ఒకేరకం టిఫిన్స్ తిని విసిగిపోతూ ఉంటారు. అలాంటి వారందరు ఇప్పుడు చెప్పిన విధంగా రుచికరమైన అల్పాహారాన్ని తయారు చేసుకోవచ్చు. ఈ టిఫిన్ చాలా రుచిగా ఉంటుంది. అలాగే చాలా తక్కువ సమయంలో చాలా సులభంగా ఈ అల్పాహారాన్ని తయారు చేసుకోవచ్చు. చాలా సులభంగా రుచిగా ఈ వెరైటీ అల్పాహారాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గోధుమపిండి దోశ తయారీకి కావల్సిన పదార్థాలు..
గోధుమపిండి – ఒక కప్పు, బొంబాయి రవ్వ – ఒక టేబుల్ స్పూన్, పుల్లటి పెరుగు – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – తగినంత, పసుపు – చిటికెడు, జీలకర్ర – అర టీ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, అల్లం తరుగు – అర టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1.
గోధుమపిండి దోశ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో గోధుమపిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో రవ్వ వేసి కలపాలి. తరువాత పెరుగుతో పాటు మిగిలిన పదార్థాలు వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. దీనిని దోశపిండిలా కలుపుకున్న తరువాత స్టవ్ మీద పెనాని ఉంచి వేడి చేయాలి. పెనం వేడయ్యాక నూనె వేసి రుద్దాలి. తరువాత పిండిని తీసుకుని దోశలాగా వేసుకోవాలి. ఈ దోశ మరీ పలుచగా రాదు. దోశ తడి ఆరిన తరువాత నూనె వేసి కాల్చుకోవాలి.ఒకవైపు కాలిన తరువాత మరో వైపుకు తిప్పి కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల గోధుమపిండి దోశ తయారవుతుంది. దీనిని ఏ చట్నీతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా చాలా సులభంగా చాలా తక్కువ సమయంలో బ్రేక్ ఫాస్ట్ ను తయారు చేసి తీసుకోవచ్చు. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.