Garlic : మన శరీరానికి అవసరమయ్యే పోషకాల్లో కొలెస్ట్రాల్ కూడా ఒకటి. మన శరీరానికి రోజూ 300మిల్లీ గ్రాముల కొలెస్ట్రాల్ అవసరమవుతుంది. కణనిర్మాణానికి, పైత్య రసం తయారీకి, హార్మోన్ల ఉత్పత్తికి, విటమిన్ డి తయారీకి ఇలా అనేక రకాలుగా మన శరీరానికి కొలెస్ట్రాల్ అవసరమవుతుంది. ఈ కొలెస్ట్రాల్ ను మన శరీరం కాలేయంలో తయారు చేసుకుంటుంది. బయట నుండి ఆహారాల ద్వారా శరీరానికి మనం కొలెస్ట్రాల్ ను అందించే అవసరం లేదు. కానీ మనం రెండు రకాలుగా కొలెస్ట్రాల్ ను తీసుకుంటున్నాము. ఒకటి మనం తీసుకునే ఆహారాల కారణంగా మన శరీరంలో కొలెస్ట్రాల్ తయారువుతుంది. ఒక రెండోవది నేరుగా కొలెస్ట్రాల్ ఉన్న ఆహారాలను తీసుకోవడం. మన శరీరం తయారు చేసుకునే కొలెస్ట్రాలే మనకు సరిపోతుంది. మనం ఆహారాల ద్వారా తీసుకునే కొలెస్ట్రాల్ అదనంగా మన శరీరంలో పేరుకుపోతుంది.
అయితే శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను కరిగించడంలో వెల్లుల్లి రెబ్బలు మనకు ఎంతో సహాయపడతాయన్న సంగతి మనలో చాలా మందికి తెలుసు. శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను కరిగించుకోవడానికి గానూ వెల్లుల్లిని పరగడుపున తింటూ ఉంటారు. వెల్లుల్లి రసాన్ని తీసుకుని తాగుతూ ఉంటారు. వంటల్లో వెల్లుల్లిని వాడుతూ ఉంటారు. వెల్లుల్లిని తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయనేది వాస్తవమే. దీనిని నిపుణులు కూడా పరిశోధనల ద్వారా వెల్లడించారు. అయితే వెల్లుల్లి అనేది ఔషధం. దీనిని ఎక్కువగా వాడలేము. అలాగే వెల్లుల్లిని వాడినప్పటికి చాలా మందిలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉంటున్నాయి. కనుక కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉన్నవారు వెల్లుల్లిని వాడినప్పటికి ఆహారంలో మార్పులు చేసుకోవడం చాలా అవసరమని నిపుణులు చెబుతున్నారు.
కార్బోహైడ్రేట్స్ కలిగిన ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం, కూర్చుని పని చేయడం, మాంసాహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. వెల్లుల్లిని తీసుకున్నప్పటికి కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గక చాలా మంది గుండె జబ్బుల బారిన పడుతున్నారు. కొలెస్ట్రాల్ ను కరిగించడంలో వెల్లుల్లి పాత్ర చాలా చిన్నది. వెల్లుల్లి తీసుకుంటున్న వారు కూడా గుండె జబ్బుల బారిన పడుతున్నారు. వెల్లుల్లి కొలెస్ట్రాల్ ను కరిగించడంలో అంత ఎక్కువగా ఉపయోగపడదని నిపుణులు చెబుతున్నారు. చాలా మంది వెల్లుల్లిని తీసుకుంటూనే కొలెస్ట్రాల్ కలిగిన ఆహారాలను తీసుకుంటున్నారు. దీంతో వెల్లుల్లిని తీసుకున్నప్పటికి అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. కనుక కొలెస్ట్రాల్ ను కరిగించడంలో వెల్లుల్లి పాత్ర చాలా చిన్నదని మనం గ్రహించాలి. ముఖ్యంగా మనం మన ఆహారంలో మార్పులు చేసుకోవాలి. అప్పుడే మనం గుండె జబ్బుల బారిన పడకుండా ఉంటామని, అధిక కొలెస్ట్రాల్ సమస్య తలెత్తకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.