Vitamin B12 : మన శరీరం సక్రమంగా పని చేయాలంటే మన శరీరానికి ఎన్నో పోషకాలు అవసరం. మన శరీరానికి అవసరమైన అతి ముఖ్యమైన పోషకాల్లో విటమిన్ బి12 కూడా ఒకటి. మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాల్లో ఇది కూడా ఒకటి. ఈ విటమిన్ ను మన శరీరం తనంతట తానే తయారు చేసుకుంటుంది. కానీ నేటి తరుణంలో మనలో చాలా మంది విటమిన్ బి12 లోపంతో బాధపడుతున్నారు. విటమిన్ బి12 లోపించడం వల్ల శరీరంలో మగతగా ఉంటుంది. నిద్ర ఎక్కువగా పోవాలనిపిస్తుంది. అలాగే చాలా నీరసంగా ఉంటుంది. నరాల్లో మంటలు ఎక్కువగా ఉంటాయి. రక్తహీనత సమస్య తలెత్తుతుంది. జుట్టు ఎక్కువగా రాలుతుంది. ఈ లక్షణాలను బట్టి మన శరీరంలో విటమిన్ బి12 లోపాన్ని మనం గుర్తించవచ్చు.
విటమిన్ బి12 లోపం తలెత్తడానికి ముఖ్య కారణం మన ప్రేగుల్లో చెడు బ్యాక్టీరియా ఎక్కువగా మంచి బ్యాక్టీరియా తక్కువగా ఉండడమేమని నిపుణులు చెబుతున్నారు. ప్రేగుల్లో చెడు బ్యాక్టీరియా ఎక్కువగా ఉండడం వల్ల మన శరీరం విటమిన్ బి12 ను తయారు చేసుకోలేకపోతుంది. మనం రసాయనాలు కలిగిన ఆహారాలను, ఎసిడిక్ ఫుడ్ నేచర్ ఉన్న ఆహారాలను, జంక్ ఫుడ్ ను, ప్రాసెస్డ్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకుంటున్నాము. దీంతో ప్రేగుల్లో చెడు బ్యాక్టీరియా ఎక్కువగా పెరుగుతుంది. దీని కారణంగా విటమిన్ బి12 లోపం తలెత్తుతుంది. కనుక మనం ముందుగా మనం మన జీవన విధానాన్ని మార్చుకోవాలి. జంక్ ఫుడ్ ను, ప్రాసెస్డ్ చేసిన ఫుడ్ ను, రసాయనాలు, పంచదారలు కలిగిన ఆహారాన్ని తక్కువగా తీసుకోవాలి.మంచి ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. దీంతో ప్రేగుల్లో మంచి బ్యాక్టీరియా శాతం పెరుగుతుంది.
మంచి బ్యాక్టీరియా శాతం పెరగడం వల్ల ప్రేగులు విటమిన్ బి12 ను తయారు చేసుకుంటాయి. దీంతో మనం విటమిన్ బి12 లోపం నుండి బయటపడవచ్చు. అలాగే విటమిన్ బి12 లోపంతో బాధపడే వారు మాంసాహార ఉత్పత్తులను ఎక్కువగా తీసుకోవాలి. జంతుసంబంధిత ఆహారమైన గుడ్లు, చికెన్, మాంసం, చేపలు, పాలు వంటి వాటిలో విటమిన్ బి12 ఎక్కువగా ఉంటుంది. వృక్ష సంబంధిత ఆహారాల్లో విటమిన్ బి12 ఉండదు. కనుక విటమిన్ బి12 ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. అయితే శాఖాహారులు ముందుగా విటమిన్ బి12 నుండి బయటపడాలంటే వైద్యులు సూచించిన మందులను వాడాలి. వీటిని నిరంతరం వాడాల్సిన అవసరం ఉండదు. వైద్యుల సూచన మేరకు కొంత సమయం వరకు వాడి ఆ తరువాత జీవన విధానంలో మార్పు చేసుకోవడం వల్ల మన శరీరంలోనే విటమిన్ బి12 ను తయారు చేసుకోవచ్చు.