Papaya : బొప్పాయి పండ్లు మనకు సీజన్లతో సంబంధం లేకుండా ఏడాది పొడవునా లభిస్తాయి. ఈ పండ్లలో మన శరీరానికి కావల్సిన అద్భుతమైన పోషకాలు ఉంటాయి. అవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వ్యాధులు రాకుండా రక్షిస్తాయి. కనుక బొప్పాయి పండ్లను రోజూ ఆహారంలో భాగం చేసుకోవాల్సి ఉంటుంది. వీటి ద్వారా అనేక ప్రయోజనాలను పొందవచ్చు. అనేక అనారోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చు.

బొప్పాయి పండ్లను తినడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. అజీర్ణం, గ్యాస్, మలబద్దకం సమస్యల నుంచి బయట పడవచ్చు. అధిక బరువు తగ్గేందుకు కూడా బొప్పాయి పండ్లు ఉపయోగపడతాయి. బొప్పాయి పండ్లను తినడం వల్ల హైబీపీ తగ్గుతుంది. శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
బొప్పాయి పండ్లను తింటే శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ కూడా తగ్గుతాయి. హార్ట్ ఎటాక్ లు రాకుండా చూసుకోవచ్చు. ఈ పండ్లలో విటమిన్లు ఎ, సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి అనేక వ్యాధులు రాకుండా చూస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అయితే బొప్పాయి పండ్ల వల్ల అధిక మొత్తంలో లాభాలను పొందాలంటే.. ఈ పండ్లను రోజులో ఏ సమయంలో తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బొప్పాయి పండ్లను రోజులో ఏ సమయంలో అయినా తినవచ్చు. వీటిని తినేందుకు ప్రత్యేక సమయం అంటూ ఏమీ లేదు. కానీ ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేశాక ఒక కప్పు బొప్పాయి పండు ముక్కలు లేదా ఒక కప్పు జ్యూస్ తాగితే శరీరానికి ఉదయమే పెద్ద ఎత్తున పోషకాలు లభిస్తాయి. దీంతో పోషణ ఉదయమే అందుతుంది. ఈ క్రమంలో రోజంతా ఉత్సాహంగా, యాక్టివ్‌గా ఉండవచ్చు. చురుగ్గా పనిచేయవచ్చు. ఎంత పనిచేసినా అలసట రాదు. శక్తి, సామర్థ్యం పెరుగుతాయి. కనుక వీలుంటే ఉదయం బ్రేక్ ఫాస్ట్‌తోనే బొప్పాయి పండ్లను తినాలి. లేదా సాయంత్రం స్నాక్స్ సమయంలోనూ తినవచ్చు.