Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

రాత్రి పూట ఈ ఫుడ్స్‌ను అస‌లు తిన‌కూడ‌దు.. ఎందుకంటే..?

Admin by Admin
June 16, 2025
in హెల్త్ టిప్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

సరిగా నిద్ర రాకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో ఒకటి మానసిక ఆందోళన. ఒత్తిడికి లోనయ్యేవారు కూడా సరిగా నిద్రపోలేరు. రోజు మనం తీసుకునే ఆహారం, సేవించే పానీయాలు, నిద్రను ప్రభావితం చేస్తాయి. నిద్రలేమికి మరో ముఖ్యం కారణం కూడా ఉంది. జీర్ణక్రియ సక్రమంగా జరుగకపోయినా నిద్రపట్టదు. జీర్ణక్రియ తీవ్రస్థాయిలో జరుగుతున్నప్పుడు నిద్రరావటం కష్టం. కాబట్టి రాత్రివేళ తీసుకునే ఆహారం విషయంలో కొన్ని నిబంధనలు పాటించాలి. మరి రాత్రిల్లో తీనకూడని కొన్ని అధిక క్యాలరీ ఫుడ్స్ లిస్ట్ క్రింది విధంగా ఉన్నాయి… నిద్రించే ముందు మీరు ఖచ్చితంగా తినకూడని 10 హై క్యాలరీ ఫుడ్స్… పెద్దగా జ్యూసిగా, రుచికరమైన పిజ్జా అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. వీటిని పగలు తింటే జీర్ణం అవ్వడానికి సరిపడా సమయం ఉంటుంది. అదే రాత్రుల్లో తీసుకుంటే, నిద్రించే సమయంలో అవయవాలన్ని చాలా నిధానంగా పనిచేయడం వల్ల జీర్ణక్రియకు కూడా నిధానం అవుతుంది.

దాంతో తిన్న ఆహారం అరగక కొవ్వుగా మారుతుంది . పిజ్జా చాలా జిడ్డుగా ఉంటుంది. నూనెలతో తయారు చేయడం వల్ల గుండెల్లో ప్రమాదం పెరుగుతుంది. దాంతో హార్ట్ బర్న్ కు కారణం అవుతుంది. ఈ ప్రపంచంలో క్యాండీస్ అంటే ఇష్టపడని వారు ఉండరంటే ఆశ్చర్యపడాల్సిందే. ఎవరైనా సరే ఏదో ఒక వయస్సులో వీటిని టేస్ట్ చూసే ఉంటారు. అంతే కాదు, ఇప్పటీకి వీటి మీద మక్కువ ఏమాత్రం తగ్గదు. అయితే బరువు తగ్గించుకోవాలనుకొనే డైటర్స్ మాత్రం వీటికి దూరంగా ఉండాల్సిందే. ఎందుకంటే వీటిలో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది బరువు పెరిగేలా చేస్తుంది. ఇవి రాత్రి సమయంలో తినడం వల్ల అలసటకు గురిచేస్తుంది. మీకు ప్రశాంతంగా మరియు పీస్ ఫుల్ గా నిద్రించాలంటే, జంక్ ఫుడ్స్ ను తీసుకోవడం నివారించి ఓట్ మీల్, లేదా తక్కువ క్యాలరీలున్న ఆహారం తీసుకోవాలి.

you should not take these foods at night know why

చాక్లెట్స్ లో ప్యాట్స్, కెఫిన్ మరియు కోకా అధికంగా ఉండటం వల్ల ఎసిడిటి సమస్యను తీవ్రతరం చేస్తాయి. డిన్నర్ తర్వాత కొన్ని డిజర్ట్స్ కు దూరంగా ఉండాలి. ముఖ్యంగా రాత్రుల్లో చాక్లెట్స్ కు దూరంగా ఉండాలి. లేదంటే మీకు నిద్రలేకుండా చేస్తుంది. కూరగాయలు రుచికరమైనవి, న్యూట్రీషియన్ డైట్ ఫుడ్స్, కానీ రాత్రిల్లో నిద్రించే ముందు తీసుకోవడం అంత మంచిది కాదు, చాలా సింపుల్ కారణం.. వెజిటేబల్స్ లోని ఉల్లిపాయ, బ్రొకోలీ లేదా క్యాబేజ్ వంటి అధిక మొత్తంలో కరగని ఫైబర్ ఉంటుంది. వీటి అరుగుదలకు ఎక్కువ సమయం తీసుకుంటుంది. పగలు కంటే రాత్రిల్లో ఫైబర్ ఫుడ్స్ అరగడం చాలా కష్టం, దాంతో జీర్ణ వ్యవస్థ చాలా నిదానంగా జరిగి అపానవాయువు ఏర్పడటానికి కారణం అవుతుంది. చాలా మంది రాత్రి సమయంలో మద్యం సేవించడం వల్ల మంచి నిద్ర పడుతుందనుకుంటారు కానీ అది తప్పు. మద్యం నిద్రకు ప్రతికూల ప్రభావాలను కలిగి ఉండి, ఎక్కువ సార్లు రెస్ట్ రూమ్ కు పోయేలా చేసి నిద్రకు భంగం కలిగిస్తుంది.

అతిగా మద్యపానం, నీటిని ఎక్కువగా తాగడం వల్ల కూడా నిద్రకు భంగం కలుగుతుంది. కాబట్టి నిద్రించే ముందు మితంగా తీసుకోవడం మంచిది. కాఫీ, టీ, కోలా డ్రింక్స్‌, సాఫ్ట్‌ డ్రింక్స్‌, సోడా, తదితరాలను మానేయాలి. ఇవి ఆన్నాశయంలోని వాల్వులను వదులయ్యేలా చేసి యాసిడ్‌ని అన్ననాళం లోకి లీక్‌ అయ్యేలా చేస్తాయి. దాంతో ఎసిడిటికి కారణం అవుతుంది. ఫలితంగా నిద్రలేమి. కాబట్టి ఈ కార్బొనేటెడ్ డ్రింక్స్ కు దూరంగా ఉండటం చాలా మంచిది. ఇతర ఫ్యాటీ ఫుడ్స్, హై క్యాలరీ ఫుడ్స్, చీజ్ బర్గర్స్ వంటి ఆహారాలను నింద్రించే ముందు తప్పనిసరిగా నివారించాలి. ఎందుకంటే అవి కడుపులో నేచురల్ యాసిడ్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇవి హార్ట్ బర్న్ కు దారితీస్తుంది.

చిల్లీ సాస్ కొన్నిమసాలా దినుసులతో చేర్చినప్పుడు చాలా ఆరోగ్యం మరియు ఉపయోగకరం. కానీ అలాగే వేటితోనూ కలపకుండా సపరేట్ గా తీసుకోవడం చాలా ప్రమాధకరం. ఈ హై క్యాలరీ ఫుడ్ ప్రోటీనులు మరియు స్లో బర్నింగ్ కార్బోహైడ్రేట్స్ ను కలిగి ఉంటుంది. టమోటో సాస్ యాసిడ్ రిఫ్లెక్షన్ కు కారణం అవుతుంది మరియు జీర్ణక్రియను నిధానం చేస్తుంది . పిజ్జా చీజ్ తో నింపి ఉంటుంది మరియు టమోటో సాస్ కూడా. కాబట్టి రాత్రుల్లో దీన్ని అవాయిడ్ చేయడం బెస్ట్. అసిడిటి ఉన్నవారు టమోటోలను పూర్తిగా మానేయమని డాక్టర్లు సలహా ఇస్తుంటారు. సాధారణంగా టమోటో జ్యూసీగా ఉండి ఎసిడిటికి కారణం అవుతుంది. దాంతో ఛాతీలో మంట పుడుతుంది. నిద్రలేమికి కారణం అవుతుంది.

Tags: foods
Previous Post

పండ్ల‌ను ఉద‌యం తిన‌డమే మంచిది.. ఎందుకంటే..?

Next Post

90 ఏళ్ల వృద్ధురాలి మృత‌దేహాన్ని ద‌హ‌నం చేసినా దంతాలు అలాగే ఉన్నాయి.. ఆశ్చ‌ర్యం..!

Related Posts

lifestyle

ఒంటరిగా ఉన్నప్పుడు నా భార్య ఫోర్స్ చేస్తోంది.. అలా ఉందామంటూ..!!

July 5, 2025
వినోదం

సర్కారు వారి పాటలో ఈ మిస్టేక్ ను గమనించారా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు అబ్బా!

July 5, 2025
వినోదం

శ్రీమంతుడు నుంచి బలగం కథలు దొంగలించారంటూ..! వివాదాస్పదంగా నిలిచిన 10 సినిమాలు ఇవేనా ?

July 5, 2025
ఆధ్యాత్మికం

వెంక‌టేశ్వ‌ర స్వామికి శ‌నివారం అంటే ఎందుకు అంత ఇష్టం..?

July 5, 2025
ఆధ్యాత్మికం

ఇంటి ప్ర‌ధాన ద్వారానికి మామిడి ఆకుల తోర‌ణాల‌నే ఎందుకు క‌డ‌తారు..?

July 5, 2025
ఆధ్యాత్మికం

ఆల‌యాల్లో గంట‌ను ఎందుకు కొడ‌తారు..? దీని వ‌ల్ల ఉప‌యోగం ఏమిటి..?

July 5, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.