ఆస్తమా ఉన్నవారిలో గాలి మార్గాలు ఇరుకుగా మారి మ్యూకస్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీంతో శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. దగ్గు, ఆయాసం ఎక్కువగా వస్తాయి. అయితే ఆస్తమా సమస్య ఉన్నవారు తగిన జాగ్రత్తలను తీసుకోకపోతే అది మరింతగా పెరిగేందుకు అవకాశం ఉంటుంది. ఆస్తమా సమస్య ఉన్నవారు కింద తెలిపిన చిట్కాలను పాటించడం వల్ల ఆ సమస్య నుంచి బయట పడవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటంటే..
1. తులసి ఆకులు 4-5 వేసి నీటిని బాగా మరిగించాలి. ఆ నీటిని కప్పు మోతాదులో తీసుకుని అందులో కొద్దిగా తేనె వేయాలి. ఈ మిశ్రమాన్ని ఉదయాన్నే తాగాలి. దీంతో శ్వాస తీసుకోవడం సులభతరం అవుతుంది. ఆస్తమా నుంచి ఉపశమనం లభిస్తుంది.
2. ఆస్తమా సమస్య ఉన్నవారు రోజూ ఉదయాన్నే పరగడుపునే 2 వెల్లుల్లి రెబ్బలను నమిలి తింటుండాలి.
3. రోజుకు రెండు పూటలా భోజనానికి ముందు 1 టీస్పూన్ అల్లం రసం సేవించాలి. శ్వాస సమస్యలు తగ్గుతాయి.
4. రాత్రి నిద్రించే ముందు గ్లాస్ గోరు వెచ్చని పాలలో కొద్దిగా పసుపు కలుపుకుని తాగితే అన్ని రకాల శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
5. కెఫీన్ ఎక్కువగా ఉండే కాఫీ, గ్రీన్ టీ, టీలను తాగుండడం వల్ల ఆస్తమా నుంచి రిలీఫ్ లభిస్తుంది.
6. ఒక పాత్రలో నీటిని తీసుకుని బాగా మరిగించి అందులో కొద్దిగా యూకలిప్టస్ ఆయిల్ వేసి ఆవిరి పట్టాలి. రోజుకు ఒకసారి ఇలా చేయాలి. ఆస్తమా నుంచి ఉపశమనం లభిస్తుంది.