పాలలో అనేక పోషకాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. రోజూ మన శరీరానికి కావల్సిన అనేక పోషకాలు పాలలో ఉంటాయి. అందువల్ల పాలను సంపూర్ణ పౌష్టికాహారంగా చెబుతారు. పాలలో ప్రోటీన్లు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఒక కప్పు నాలను తాగితే 8 గ్రాముల మేర ప్రోటీన్లు లభిస్తాయి. అందువల్ల పాలను తాగితే అనేక ప్రయోజనాలు పొందవచ్చు.
వ్యాయామం చేసినవారు పాలను తాగడం వల్ల శక్తి లభిస్తుంది. కండరాలు మరమ్మత్తులకు గురవుతాయి. పాలను ఉదయం తాగితే రోజంతా కడుపు నిండిన భావన కలుగుతుంది. ఆకలిని తగ్గించే హార్మోన్లైన జీఎల్‌పీ-1, పీవైవై, సీసీకే వంటి హార్మోన్ల స్థాయిలు పెరుగుతాయి. ఆకలిని పెంచే హార్మోన్ అయిన గ్రెలిన్ స్థాయిలు తగ్గుతాయి. దీంతో ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. ఫలితంగా ఆహారాన్ని తక్కువగా తీసుకుంటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది.
న్యూట్రిషనిస్టులు చెబుతున్న ప్రకారం.. రోజూ రాత్రి నిద్రకు ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలను తాగితే నిద్ర చక్కగా పడుతుంది. నిద్రలేమి సమస్య నుంచి బయట పడవచ్చు. పాలలో ట్రిప్టోఫాన్, మెగ్నిషియం, మెలటోనిన్ అనే పోషకాలు ఉంటాయి. ఇవి నిద్ర సమస్యలను తగ్గిస్తాయి. నిద్ర చక్కగా పట్టేలా చేస్తాయి.
పాలలో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. కనుక పాలను రాత్రి నిద్రకు ముందు తాగితే శరీర మెటబాలిజం పెరుగుతుంది. క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. దీంతో బరువు తగ్గుతారు. పాలలో కాల్షియం, విటిమణ్ డి, లినోలీనిక్ యాసిడ్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి మెటబాలిజంను పెంచి బరువు తగ్గేందుకు సహాయ పడతాయి.
ఉదయం పాలను తాగడం వల్ల కండరాలు నిర్మాణం అవుతాయి. శఖ్తి లభిస్తుంది. రోజంతా యాక్టివ్‌గా పనిచేయవచ్చు. అదే రాత్రి పాలను తాగితే బరువు తగ్గవచ్చు. పోషకాలు లభిస్తాయి. హైబీపీ కూడా తగ్గుతుంది. అందువల్ల రాత్రి నిద్రకు ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలను తాగడం అలవాటు చేసుకోవాలి. పాలలో కొవ్వు తీసిన పాలు అయితే ఇంకా మంచిది. అందులో కొద్దిగా తేనె లేదా పసుపు లేదా మిరియాల పొడి వంటివి కలిపి తాగితే అదనపు ప్రయోజనాలు కలుగుతాయి.