Watermelon Juice : వేసవి కాలంలో మనకు విరివిరిగా లబించే వాటిల్లో పుచ్చకాయ ఒకటి. వేసవి కాలంలో పుచ్చకాయను తినని వారు ఉండరు. పుచ్చకాయను తినడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. దీనిని తినడం వల్ల శరీరంలో ఉండే వేడి తగ్గి చలువ చేస్తుంది. ఎండ వల్ల కలిగే నీరసాన్ని తగ్గించడంలో పుచ్చకాయ ఎంతగానో ఉపయోగపడుతుంది. పుచ్చకాయను తినడం వల్ల శరీరం కోల్పోయిన ఎలక్ట్రోలైట్స్ ను తిరిగి పొందవచ్చు. చాలా మంది పుచ్చకాయను ముక్కలుగా చేసుకుని తింటూ ఉంటారు. అంతేకాకుండా దీంతో చల్లచల్లని జ్యూస్ ను కూడా చేసుకోవచ్చు. కేవలం 2 నిమిషాలలోనే మనం ఈ జ్యూస్ ను తయారు చేసుకోవచ్చు. పుచ్చకాయతో ఎంతో రుచిగా ఉండే జ్యూస్ ను ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వాటర్ మిలన్ జ్యూస్ తయారీకి కావల్సిన పదార్థాలు..
పుచ్చకాయ ముక్కలు – రెండు కప్పులు, పంచదార – 4 టీ స్పూన్లు లేదా తగినంత, పుదీనా ఆకులు – 10, ఐస్ క్యూబ్స్ – 4, నిమ్మరసం – అర టీ స్పూన్, ఉప్పు – చిటికెడు.
వాటర్ మిలన్ జ్యూస్ తయారీ విధానం..
ముందుగా పుచ్చ కాయ ముక్కలలో గింజలు లేకుండా చూసుకోవాలి. తరువాత వాటిని ఒక జార్ లో లేదా బ్లెండర్ లో వేయాలి. ఇందులోనే పంచదార, పుదీనా ఆకులు, ఐస్ క్యూబ్స్ వేసి మూత పెట్టి 2 నిమిషాల పాటు మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ జ్యూస్ ను వడకడుతూ ఒక గిన్నెలో పోసి అందులో నిమ్మరసం, ఉప్పు వేసి కలిపి గ్లాసులో పోసుకుని తాగాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వాటర్ మిలన్ జ్యూస్ తయారవుతుంది. ఇలా పుచ్చకాయతో జ్యూస్ ను చేసుకుని తాగడం వల్ల ఎండ నుండి ఉపశమనం కలగడంతోపాటు శరీరానికి కూడా మేలు కలుగుతుంది. ఈ జ్యూస్ ను తాగడం వల్ల కూడా మనం పుచ్చకాయను తినడం వల్ల కలిగే ప్రయోజనాలను పొందవచ్చు.