Kidneys Health : రోజూ మనం తినే ఆహారాలు, తాగే ద్రవాల్లో ఉండే అనేక వ్యర్థాలను కిడ్నీలు వడబోస్తుంటాయి. దీంతో కిడ్నీల్లో వ్యర్థాలు, విష పదార్థాలు పేరుకుపోతుంటాయి. అయితే రోజూ వాటిని బయటకు పంపేయాలి. లేదంటే అనారోగ్య సమస్యలు వస్తాయి. కిడ్నీలు పాడవుతాయి.
అయితే కిడ్నీలను శుభ్రం చేసుకోవడం ఎలా అని ఆలోచిస్తున్నారా ? అందుకు పెద్దగా శ్రమించాల్సిన పనిలేదు. మీ ఇంట్లో ఉండే పలు ఆహారాలతోనే కిడ్నీలను ఇలా శుభ్రం చేసుకోవచ్చు. అందుకు ఏం చేయాలి ? ఆ ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలి ? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక కొత్తిమీర కట్ట తీసుకుని ఆకులను సన్నగా తరగాలి. అనంతరం వాటిని బాగా శుభ్రం చేయాలి. ఒక గ్లాస్ నీటిని తీసుకుని ఒక పాత్రలో పోసి మరిగించాలి. నీరు మరుగుతున్నప్పుడు అందులో ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఆకులను వేయాలి. తరువాత ఐదు నిమిషాల పాటు మరిగించాలి. అనంతరం చల్లార్చాలి. బాగా చల్లారాక ఆ నీటిని వడకట్టి అందులో కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి తాగేయాలి.
ఈ ఔషధాన్ని రోజుకు ఒకసారి ఎప్పుడైనా తాగవచ్చు. దీని వల్ల కిడ్నీల్లోని వ్యర్థాలు బయటకు పోయి కిడ్నీలు శుభ్రంగా మారుతాయి.
అయితే కొత్తిమీరకు బదులుగా కరివేపాలకు కూడా ఉపయోగించవచ్చు. ఇవి కూడా కిడ్నీలను సంరక్షిస్తాయి.