పెరిగిన జనాభా నాగరికత కారణంగా రోజురోజుకూ గాలి కాలుష్యం ఎక్కువవుతోంది. ఈ గాలి కాలుష్యం ప్రభావం ప్రకృతిలోని జీవులతోపాటు మన ఆరోగ్యం పైన కూడా పడుతోంది. గాలి కాలుష్యం కారణంగా శ్వాసకోస సంబంధిత సమస్యల బారిన పడే వారు రోజురోజుకూ ఎక్కువవుతున్నారు. కేవలం గాలికాలుష్యం వల్ల మాత్రమే కాకుండా పొగ తాగడం, మద్య సేవించడం, ఇతర దీర్ఘకాల అనారోగ్యాల కారణంగా కూడా ఊపిరితిత్తులకు సంబంధించిన అనేక రకాల సమస్యలు వస్తున్నాయి. శ్వాసకోస సంబంధిత సమస్యలు రాకుండా ఉండాలంటే మనం ఊపిరితిత్తులలోని మలినాలను తొలగించి వాటిని ఎల్లప్పుడూ శుభ్రంగా, ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి.
ఊపిరితిత్తులు పాడైపోయి ప్రాణాల మీదికి తెచ్చుకోవడానికి బదులుగా వాటిని ఆరోగ్యంగా ఉంచుకోవడం ఉత్తమం. మన ఇంట్లోనే సహజంగా దొరికే పదార్థాలతో చాలా తక్కువ ఖర్చుతోనే డ్రింక్ ను తయారు చేసుకుని వాడడం వల్ల ఊపిరితిత్తుల్లోని మలినాలు తొలగిపోయి ఊపితితిత్తులు పూర్తిగా శుభ్రపడతాయి. దీంతో శ్వాసకోస సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. ఊపిరితిత్తులను శుభ్రపరిచే ఈ డ్రింక్ ను ఎలా తయారు చేసుకోవాలి.. అదే విధంగా ఈ డ్రింక్ ను ఎలా ఉపయోగించాలి… అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ డ్రింక్ ను తయారు చేసుకోవడానికి గాను ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని తీసుకోవాలి. తరువాత అందులో ఒక ఇంచు పరిమాణంలో ఉండే అల్లాన్ని శుభ్రపరిచి ముక్కలుగా కోసి వేసుకోవాలి. తరువాత ఇందులోనే ఒక చిన్న ఉల్లిపాయను ముక్కలుగా కోసి వేయాలి. అలాగే దీనిలో పావు టీ స్పూన్ పసుపును వేసి కలిపి ఈ నీటిని అర గ్లాస్ అయ్యే వరకు మరిగించాలి. తరువాత ఈ నీటిని వడకట్టి చల్లగా అయ్యే వరకు ఉంచాలి. ఈ డ్రింక్ చల్లగా అయిన తరువాత దీనిలో ఒకటి లేదా రెండు టీ స్పూన్ల తేనెను కలపాలి.
ఇలా తయారు చేసుకున్న ఈ డ్రింక్ ను గాలి తగలకుండా గాజు సీసాలో పోసి ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకోవాలి. ఇలా నిల్వ చేసుకున్న ఈ డ్రింక్ ను పూటకు రెండు టీ స్పూన్ల మోతాదులో రెండు పూటలా తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల కేవలం మూడు రోజుల్లోనే వ్యర్థ పదార్థాలన్నీ తొలగిపోయి ఊపిరితిత్తులు శుభ్రపడతాయి. ధూమపానం, మద్యపానం అలవాటు ఉన్న మాత్రం ఈ డ్రింక్ ను క్రమం తప్పకుండా కనీసం రెండు నెలల పాటు తీసుకోవడం వల్ల మాత్రమే మనం చక్కటి ఫలితాలను పొందవచ్చు. ఈ విధంగా ఈ డ్రింక్ ను తయారు చేసుకుని తాగడం వల్ల ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుపడి శ్వాసకోస సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి.