Bad Breathe : మనలో చాలా మంది నోటి దుర్వాసన, దంతక్షయం, నాలుకపై ఎక్కువగా పాచి పేరుకుపోవడం, దంతాలు గారపట్టడం వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. వయసుతో సంబంధం లేకుండా పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఈ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి రోజుకు రెండు పూటలా టూత్ పేస్ట్ తో దంతాలను శుభ్రం చేసుకున్నప్పటికి ఎటువంటి ఫలితం లేదు. మార్కెట్ లో దొరికే వివిధ రకాల టూత్ పేస్ట్ లకు వాడినప్పటికి ఈ సమస్యలు ఏ మాత్రం తగ్గు ముఖం పట్టడం లేదు. నోటి ఆరోగ్యం దెబ్బతినడానికి ప్రధాన కారణం మనం తీసుకునే ఆహారం. ఎక్కువగా జంక్ ఫుడ్ ను తీసుకోవడం వల్ల, పంచదార కలిగిన పదార్థాలను తీసుకోవడం వల్ల, శీతల పానీయాలను తాగడం వల్ల నోటి ఆరోగ్యం దెబ్బతింటుంది.
ఈ ఆహారాలను తిన్న తరువాత నోటిని శుభ్రం చేసుకున్నప్పటికి మన రుచిగులికల్లో పంచదార ఉంటుంది. ఇలా నోట్లో ఉండే పంచదార కారణంగా నోట్లో చెడు బ్యాక్టీరియా శాతం పెరుగుతుంది. దీంతో దంతాలు పుచ్చిపోవడం, గార పట్టడం, నాలుకపై పాచి ఎక్కువగా పేరుకుపోవడం, దంతాలు పుచ్చిపోవడం వంటివి జరుగుతుంది. నోటి ఆరోగ్యం మెరుగుపడాలంటే మనం జంక్ ఫుడ్ ను తక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా పంచదార ఉండే పదార్థాలను తక్కువగా తీసుకోవాలి. దీంతో పాటు ఒక చక్కటి చిట్కాను పాటించాలి. ఈ చిట్కాను పాటించడం వల్ల నోట్లో చెడు బ్యాక్టీరియా పెరగకుండా ఉంటుంది. ఈ చిట్కాను వాడడం చాలా సులభం.
దీని కోసం రోజూ రాత్రి పడుకునే ముందు నోట్లో రెండు టీ స్పూన్ల తేనెను వేసుకోవాలి. ఈ తేనెను అన్ని దంతాలకు, చిగుళ్లకు తగిలేలా చప్పరించాలి. నోట్లో నీళ్లు పోసి పుక్కిలించకుండా ఈ తేనెను నోట్లో అలాగే ఉంచుకుని నిద్రపోవాలి. ఇలా చేయడం వల్ల నోటి దుర్వాసన సమస్య తగ్గుతుంది. దంతాలు పుచ్చిపోకుండా ఉంటాయి. నాలుకపై పాచి పేరుకుపోవడం తగ్గుతుంది. తేనె యాంటీ బ్యాక్టీరియల్ గా పని చేస్తుంది. నోట్లో ఉండే బ్యాక్టీరియాలను ఇది నశింపజేస్తుంది. దీంతో నోట్లో బ్యాక్టీరియా శాతం తగ్గుతుంది. నోటికి సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ విధంగా తేనెను ఉపయోగించడం వల్ల నోటి ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.