Hair Growth : జుట్టు పొడువుగా, ఒత్తుగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దీని కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎంత ప్రయత్నించినప్పటికీ కొందరిలో జుట్టు పొడువుగా పెరగదు. జుట్టు పెరుగుదల కోసం రకరకాల నూనెలను, విటమిన్ టాబ్లెట్ లను వాడుతూ ఉంటారు. అయినప్పటికీ ఫలితం మాత్రం అంతగా ఉండదు. అయితే ఓ అద్భుతమైన ఇంటి చిట్కాను ఉపయోగించి మనం జుట్టును పొడువుగా, ఒత్తుగా పెరిగేలా చేసుకోవచ్చు.
మనం వంటల్లో ఉపయోగించే ఉల్లిపాయలను జుట్టు సమస్యల కోసం వాడవచ్చు. ముందుగా మధ్యస్థంగా ఉండే నాలుగు ఉల్లిపాయలను తీసుకుని పైన ఉండే పొట్టును తీసి పెద్ద పెద్ద ముక్కలుగా చేసుకోవాలి. ఒక జార్ లో ఈ ఉల్లిపాయ ముక్కలను వేసి నీరు వేయకుండా పేస్ట్ లా చేసుకోవాలి. ఇలా చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ నుండి జల్లిగంట లేదా వస్త్రం సహాయంతో ఉల్లిపాయ జ్యూస్ ను తీసుకోవాలి. ఇలా తీసుకున్న జ్యూస్ ను దూదితో లేదా స్ప్రే బాటిల్ లో వేసి తలకు బాగా పట్టించాలి.
జ్యూస్ తీయగా మిగిలిన ఉల్లిపాయ పేస్ట్ ను జుట్టుకు పట్టించాలి. గంటకు ఒకసారి ఇలా ఉల్లిపాయ జ్యూస్ ను రెండు సార్లు తలకు పట్టించాలి. ఇలాపట్టించిన గంట తరువాత తలస్నానం చేయాలి. వారానికి ఒక సారి ఇలా చేయడం వల్ల జుట్టు ఒత్తుగా, పొడువుగా పెరగడమే కాకుండా జుట్టు నిగారింపును సొంతం చేసుకుంటుంది. అంతే కాకుండా చుండ్రు, ఇతర జుట్టు సమస్యలు కూడా తగ్గుతాయి.