Milk For Face : పాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనందరికి తెలిసిందే. పాలల్లో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. ప్రతిరోజూ పాలను తాగడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. కేవలం మన శరీర ఆరోగ్యాన్నే కాదు ముఖ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో కూడా పాలు మనకు ఎంతో సహాయపడతాయి. పాలను వాడడం వల్ల ముఖంపై పేరుకుపోయిన దుమ్ము, ధూళి, మృతకణాలు తొలగిపోతాయి. ముఖంపై ఉండే నలుపు తొలగిపోయి ముఖం అందంగా, కాంతివంతంగా తయారవుతుంది. అయితే పాలను ఏ విధంగా ఉపయోగించడం వల్ల ముఖ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక గిన్నెలో రెండు టీ స్పూన్ల ముల్తానీ మట్టిని తీసుకోవాలి.
తరువాత ఇందులో ఒక టీ స్పూన్ టమాట రసం వేసి కలపాలి. తరువాత ఇందులో ఫేస్ ప్యాక్ కు సరిపడా పచ్చి పాలను పోసి పేస్ట్ లా కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఫేస్ ప్యాక్ ను ఉపయోగించే ముందు ముఖాన్ని నీటితో శుభ్రంగా కడగాలి. తరువాత నిమ్మచెక్కను పంచదారలో ముంచి పంచదారతో ముఖాన్ని స్క్రబ్ చేసుకోవాలి. ఇలా స్క్రబ్ చేసుకున్న 5 నిమిషాల తరువాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. తరువాత ముందుగా తయారు చేసుకున్న ప్యాక్ ను ముఖానికి రాసుకుని సున్నితంగా మర్దనా చేసుకోవాలి. ఆరిన తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఈ విధంగా పాలతో ఫేస్ ప్యాక్ ను తయారు చేసుకుని వాడడం వల్ల ముఖంపై ఉండే నలుపు, మృత కణాలు తొలగిపోతాయి. ముఖంపై ఉండే జిడ్డు తొలగిపోయి ముఖం కాంతివంతంగా మారుతుంది. ముఖంపై ఉండే ముడతలు, మచ్చలు తొలగిపోయి ముఖం అందంగా మారుతుంది. చర్మానికి కావల్సిన పోషకాలు అంది చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే ఈ ఫేస్ ప్యాక్ ను ముఖానికి వేసుకున్నప్పుడు ముఖాన్ని కదిలించకుండా అలాగే ఉంచాలి. ఈ విధంగా ఈ ఫేస్ ప్యాక్ ను వారానికి ఒకసారి తయారు చేసుకుని వాడడం వల్ల మనం మన ముఖాన్ని అందంగా మార్చుకోవచ్చు.