Unwanted Hair : ప్రస్తుత కాలంలో అవాంఛిత రోమాలతో బాధపడే స్త్రీల సంఖ్య ఎక్కువవుతుందనే చెప్పవచ్చు. వివిధ రకాల అనారోగ్య సమస్యలతోపాటు హార్మోన్లకు సంబంధించిన మందులను వాడడం వల్ల స్త్రీలల్లో ఈ సమస్య తలెత్తుతోంది. ఈ అవాంఛిత రోమాలను తొలగించుకోవడానికి మార్కెట్ లో దొరికే సౌందర్య సాధనాలను వాడడంతోపాటు వ్యాక్సింగ్ వంటి పద్దతులను కూడా అనుసరిస్తుంటారు. వీటిని తరచూ వాడడం వల్ల చర్మం దెబ్బతినే అవకాశం ఉంటుంది. కనుక ఈ అవాంఛిత రోమాలను తొలగించుకోవడానికి సహజసిద్ధ మార్గాలను ఉపయోగించడమే ఉత్తతమమైన పద్దతి.
మన ఇంట్లో ఉండేపదార్థాలతో అవాంఛిత రోమాలను ఎలా తొలగించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గాను మనం బేకింగ్ సోడా, నీళ్లు, దూదిని ఉపయోగించాల్సి ఉంటుంది. దీని కోసం ముందుగా శుభ్రమైన గిన్నెను తీసుకుని అందులో మూడు టీ స్పూన్ల గోరు వెచ్చని నీటిని తీసుకోవాలి. తరువాత అందులో ఒక టీ స్పూన్ బేకింగ్ సోడాను వేసి బాగా కలపాలి. తరువాత దూదిని తీసుకుని అందులో ముంచి అవాంఛిత రోమాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఈ మిశ్రమాన్ని రాసి ఈ దూదిని కూడా వాటిపై రాత్రంతా అలాగే ఉంచాలి.
ఉదయాన్నే నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ చిట్కాను తరచూ వాడడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా ఎటువంటి ఖర్చు లేకుండా చాలా తక్కువ సమయంలోనే అవాంఛిత రోమాలను తొలగించుకోవచ్చు. అవాంఛిత రోమాలతో బాధపడే వారు ఈ చిట్కాను పాటించడం వల్ల చక్కటి ఫలితాలను పొందవచ్చు.