Black Cumin For Fat : ఈ పొడిని రోజూ ఒక టీ స్పూన్ మోతాదులో తీసుకుంటే చాలు మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వు మొత్తం కరిగిపోతుంది. నేటి తరుణంలో వసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు శరీరంలో కొవ్వు పేరుకుపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం మన శరీరంలో మెటబాలిజం రేటు తక్కువగా ఉండడమే. ఈ చిట్కాను పాటించడం వల్ల శరీరంలో మెటబాలిజం రేటు పెరగడంతో పాటు తిన్న ఆహారం కూడా త్వరగా జీర్ణమవుతుంది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వు త్వరగా కరిగిపోతుంది. శరీరంలో కొవ్వును కరిగించే ఈ చిట్కాను ఎలా తయారు చేసుకోవాలి..తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ మనం కేవలం రెండు పదార్థాలనే ఉపయోగించాల్సి ఉంటుంది. దీని కోసం మనం నల్ల జీలకర్రను ఉపయోగించాల్సి ఉంటుంది.
శరీర బరువును తగ్గించడంలో, మెటబాలిజం రేటును పెంచడంలో, కొవ్వును తొలగించడంలో ఇది అద్భుతంగా పని చేస్తుంది. నల్ల జీలకర్ర చాలా చేదుగా ఉంటుంది. ఆయుర్వేద షాపుల్లో, ఆన్ లైన్ లో ఈ నల్ల జీలకర్ర చాలా సులభంగా లభిస్తుంది. నల్ల జీలకర్రను వాడడం వల్ల పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు చాలా సులభంగా కరిగిపోతుంది. పొట్టలో ఉండే వివిధ రకాల సమస్యలు తగ్గుతాయి. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా ఉంటాము. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అలాగే మరో ఉపయోగించాల్సిన మరో పదార్థం అవిసె గింజలు. వీటిలో పోషకాలతో పాటు ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. అవిసె గింజలను తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సమయం ఆకలి వేయకుండా ఉంటుంది.
ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ ముందుగా ఒక గిన్నెలో 3 టీ స్పూన్ల నల్ల జీలకర్రను తీసుకోవాలి. తరువాత ఇందులో 2 టీ స్పూన్ల అవిసె గింజలను తీసుకోవాలి. వీటిని చిన్న మంటపై దోరగా వేయించాలి. తరువాత వీటిని జార్ లో వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి. ఇందులో రుచి కొరకు అర టీ స్పూన్ సైంధవ లవణాన్ని కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పొడిని గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని రోజుకు రెండు సార్లు తీసుకోవాలి. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీళ్లల్లో అర టీ స్పూన్ పొడిని కలుపుకుని రోజూ ఉదయం పరగడుపున టీ తాగినట్టు చప్పరిస్తూ తాగాలి. అలాగే దీనిని తీసుకున్న అరగంట వరకు ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు. మరలా రాత్రి భోజనం చేసిన అరగంట తరువాత ఈ పొడిని నీటిలో కలిపి తీసుకోవాలి.
ఇలా రోజుకు రెండు పూటలా తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు సులభంగా కరిగిపోతుంది. శరీర బరువు అదుపులో ఉంటుంది. తగ్గిన బరువు మరలా పెరగకుండా ఉండవచ్చు. అంతేకాకుండా అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. శరీరంలో కొవ్వు పేరుకుపోయి ఇబ్బంది పడుతున్న వారు ఈ చిట్కాను పాటించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.