Cholesterol Drink : నేటి తరుణంలో చాలా మంది కీళ్లనొప్పులు, నడుమునొప్పి, వెన్ను నొప్పి, మోకాళ్ల నొప్పులు వంటి సమస్యలతో బాధపడుతున్నారు. కీళ్ల సంబంధిత సమస్యలతో బాధపడే వారు ఈ ఒక్క గ్లాస్ కషాయాన్ని తాగడం వల్ల అన్ని రకాల కీళ్ల నొప్పులను చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. రోజంతా పని ఒత్తిడి కారణంగా అలసట, నీరసం, నొప్పులు రావడం సహజమే. కానీ మరుసటి రోజు ఉదయం కూడా ఈ నొప్పులు ఇలాగే ఉంటే దీని గురించి మనం ఆలోచించాల్సిందే. ఈ నొప్పులే ఎక్కువై మనం నడవలేని స్థితికి చేరుకున్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇలా కీళ్ల నొప్పులు తలెత్తడానికి ప్రధాన కారణం మన శరీరంలో వాత దోషాలు ఎక్కువవడం. ఈ వాత దోషాలను తొలగించుకోకపోతే ఇవి మరింత ఎక్కువయ్యి మన శరీరంలోకి ప్రతి భాగానికి చేరిపోతుంది. ఈ వాత దోషాలు ఎక్కువవడం వల్ల కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు వంటి సమస్యలు తలెత్తుతాయి.
వాత దోషం కారణంగా గ్యాస్, అజీర్తి, మలబద్దకం, ఎసిడిటి వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. తలనొప్పి నుండి పాదాల నొప్పుల వరకువచ్చే అన్ని రకాల నొప్పులు తగ్గాలంటే శరీరంలో ఉండే వాత దోషాన్ని తొలగించుకోవాలి. మన ఇంట్లో ఉండే పదార్థాలతో ఈ ఒక గ్లాస్ కషాయాన్ని తాగడం వల్ల మన శరీరంలో ఉండే వాత దోషాలు తొలగిపోతాయి. అంతేకాకుండా వాత దోషాల కారణంగా వచ్చే అన్ని రకాల నొప్పులు కూడా తగ్గుతాయి. శరీరంలో వచ్చే వాత దోషాలను తొలగించే ఈ కషాయాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీని కోసం ముందుగా ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీటిని తీసుకోవాలి. తరువాత ఒక ఇందులో అర టీ స్పూన్ శొంఠి పొడిని వేసి కలపాలి. తరువాత ఇందులో ముప్పావు టీ స్పూన్ వామును వేయాలి. చివరగా ఇందులో ఒక బిర్యానీ ఆకును ముక్కలుగా చేసి వేసుకోవాలి.

ఇప్పుడు ఈ నీటిని ఒక గ్లాస్ కషాయం అయ్యే వరకు బాగా మరిగించాలి. తరువాత ఈ నీటిని వడకట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. ఇందులో తీపి కొరకు ఒక టీ స్పూన్ బెల్లం తురుమును వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న కషాయాన్ని రోజులో ఎప్పుడైనా తీసుకోవచ్చు. కానీ రోజుకు ఒక్కసారి మాత్రమే తీసుకోవాలి. అలాగే ఈ కషాయాన్ని తీసుకున్నంత కాలం జంక్ ఫుడ్ కు, ఫాస్ట్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. ఈ కషాయాన్ని తీసుకోవడం వల్ల వాత దోషాలు తొలగిపోవడంతో పాటు అన్ని రకాల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. అంతేకాకుండా జీర్ణశక్తి పెరిగి గ్యాస్, ఎసిడిటి, అజీర్తి వంటి సమస్యలు తగ్గుతాయి. ఈ కషాయాన్ని తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వు కరిగి బరువు కూడా తగ్గుతారు. కీళ్ల నొప్పులతో బాధపడే వారు పైన చెప్పిన విధంగా కషాయాన్ని తయారు చేసుకుని తాగడం వల్ల చక్కటి ఫలితాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.