Curd For Dandruff : ఒక చిన్న చిట్కాను వాడడం వల్ల మనం శాశ్వతంగా చుండ్రు సమస్య నుండి బయటపడవచ్చని మీకు తెలుసా..! మనల్ని వేధించే జుట్టు సంబంధిత సమస్యల్లో చుండ్రు సమస్య కూడా ఒకటి. వయసుతో సంబంధం లేకుండా అందరిని ఈ సమస్య వేధిస్తుంది. తలను సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం, వాతావరణ కాలుష్యం, పొడి చర్మం వంటి వివిధ కారణాల చేత చుండ్రు సమస్య తలెత్తుతుంది. తలలో చుండ్రు కారణంగా జుట్టు రాలడం, దురద వంటి సమస్యలు కూడా ఉంటాయి. చలికాలంలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. చుండ్రు సమస్య నుండి బయటపడడానికి మార్కెట్ లో లభించే అన్ని రకాల షాంపులను వాడుతూ ఉంటారు. షాంపులను వాడడం వల్ల ఎటువంటి ఫలితం ఉండదనే చెప్పవచ్చు.
చుండ్రు సమస్యతో బాధపడే వారు ఇప్పుడు చెప్పే చిట్కాను వాడడం వల్ల చుండ్రు సమస్య నుండి సులభంగా ఉపశమనాన్ని పొందవచ్చు. ఈ చిట్కాను వాడడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. అలాగే ఇందులో వాడే ప్రతి పదార్థం కూడా సహజ సిద్దమైనదే. చుండ్రు సమస్యను తగ్గించే ఈ చిట్కాను ఎలా తయారు చేసుకోవాలి.. ఎలా వాడాలి…అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ ఒక జార్ లో ఒక కప్పు వేపాకును, అర చెక్క నిమ్మరసాన్ని, మూడు టేబుల్ స్పూన్ల పెరుగు తగినన్ని నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని గిన్నెలోకి తీసుకున్న తరువాత దీనిని తల చర్మానికి అంటేలా బాగా పట్టించాలి.
దీనిని ఒక గంట పాటు అలాగే ఉంచి ఆ తరువాత కుంకుడుకాయలతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది. వేపాకు, పెరుగు, నిమ్మరసంలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. ఇవి చుండ్రుకు కారణమయ్యే ఫంగస్ ను నశింపజేసి చుండ్రు సమస్య తగ్గేలా చేయడంలో సహాయపడతాయి. అలాగే ఈ చిట్కాను వాడడం వల్ల జుట్టుకు తగినంత తేమ లభించి చుండ్రు సమస్య మరలా రాకుండా ఉంటుంది. జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుంది. ఈ విధంగా ఈ చిట్కాను వాడడం వల్ల చాలా తక్కువ ఖర్చులో ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా చుండ్రు సమస్యను తగ్గించుకోవచ్చు.