ప్రస్తుత తరుణంలో చాలా మంది కంటి చూపు సమస్యతో బాధపడుతున్నారు. రాను రాను చూపు సన్నగిల్లుతోంది. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. ఫోన్లు, కంప్యూటర్లు, టీవీల ఎదుట గంటల తరబడి గడపడం, పోషకాహార లోపం వల్ల దృష్టి లోపాలు వస్తున్నాయి. అయితే కింద తెలిపిన చిట్కాలను పాటిస్తే దాంతో కంటి చూపు పెరుగుతుంది. మరి ఆ చిట్కాలు ఏమిటంటే..
కంటి చూపు మెరుగు పడాలంటే రోజూ ఆహారంలో 50 గ్రాముల మేర పచ్చి ఉల్లిపాయలను తింటుండాలి. వీటిలో ఉండే సల్ఫర్ మన శరీరంలో గ్లూటాథియోన్ అనే యాంటీ ఆక్సిడెంట్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని వల్ల కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. కంటి చూపు పెరుగుతుంది.
ఉసిరికాయల్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడంట్లు ఉంటాయి. అందువల్ల రోజూ 30 ఎంఎల్ మోతాదులో పరగడుపునే ఉసిరికాయ జ్యూస్‌ను తాగుతుండాలి. దీంతో కంటి చూపును మెరుగు పరుచుకోవచ్చు.
బాదం పప్పును రాత్రి పూట నీటిలో గుప్పెడు మోతాదులో నానబెట్టి మరుసటి రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ లో వాటిని పొట్టు తీసి తినాలి. బాదంపప్పులో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ ఇ కళ్లను సంరక్షిస్తాయి. కంటి చూపును మెరుగు పరుస్తాయి.
త్రిఫల చూర్ణాన్ని చిటికెడు మోతాదులో తీసుకుని రాత్రి పూట ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కలిపి తాగుతుండాలి. దీని వల్ల కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
రాత్రి పూట పాదాలకు ఆవనూనెతో మర్దనా చేసి మరుసటి రోజు ఉదయం కడిగేయాలి. అలాగే ఉదయం వేకువ జామున పచ్చని గడ్డిపై చెప్పులు లేకుండా కొంత సేపు నడవాలి. ఇలా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభించడమే కాదు, కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
రోజూ ద్రాక్షలను ఒక కప్పు మోతాదులో తింటున్నా కళ్లను రక్షించుకోవచ్చు. దీంతోపాటు రోజూ ఒక కప్పు మోతాదులో దానిమ్మ పండ్ల జ్యూస్‌ను తాగవచ్చు. దీని వల్ల కూడా కంటి చూపు మెరుగు పడుతుంది.