Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home చిట్కాలు

పాదాలు పొడిగా మారి ఇబ్బంది పెడుతున్నాయా..? అయితే ఇలా చేయండి..!

Admin by Admin
February 25, 2025
in చిట్కాలు, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఈ కాలంలో మన పాదాలు, చేతులు రంగుమారిపోతాయి. పగుళ్లు వచ్చి అస‌హ్యంగా కనిపిస్తాయి. వీటిపై సంరక్షణ తీసుకుంటే పాదాలు, చేతులను కోమలంగా ఉంచగలుగుతాం. ఈ కాలంలో పాదాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో కాలి మడమలపై పగుళ్లు వచ్చి సమస్య మరింత పెరుగుతుంది. అదే డయాబెటిస్ ఉన్నవారికైతే ఈ సమస్య వచ్చినప్పుడు అదే తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. అంతే కాదు ఈ సీజన్ లో ఎక్కువగా పొడిబారడం జరుగుతుంది. చర్మం అతి త్వరగా పొడిబారి, పగుళ్ళు ఏర్పడి, చారలు కనబడుతుంటాయి. కాళ్ళు మరింత అసహ్యంగా కనబడుతాయి. కాబట్టి… ఈ కాలంలో పాదాలను జాగ్రత్తగా ఉంచుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అందమైన పాదాలు సొంతం చేసుకోవాలంటే 15 రోజులకోసారి పెడిక్యూర్ చేయించాలి. పెడిక్యూర్ కోసం పార్లర్‌కు వెళ్లలేని వారు ఇంట్లో దొరికే వస్తువులతోనే పెడిక్యూర్ చేసుకోవచ్చు.

గోరు వెచ్చని నీటిలో కొంచెం ఉప్పు, హైడ్రోజన్‌పెరాక్సైడ్ లేదా డెటాల్, షాంపూ వేయాలి. అందులో 15 నుంచి 20 నిమిషాలపాటు కాళ్లను నానబెట్టాలి. బయటకు తీసి ప్యూమిక్‌స్టోన్ లేదా స్క్రబ్బింగ్ స్టోన్ లేదా బ్రష్ ఉపయోగించి రుద్దాలి. దీనివల్ల పాదాలపై ఉన్న మృతకణాలు తొలగిపోతాయి. తరువాత ఒక నిమ్మకాయ చెక్క తీసుకుని దానిపై గ్లిజరిన్ వేసి బాగా రుద్దాలి. అనంతరం ఆలివ్ ఆయిల్‌తో కాలును మొత్తం మసాజ్ చేయాలి. అనంతరం పాదాలకు సాక్స్ వేసుకోవాలి. ముల్తానీ మట్టిలో గులాబీనీరు కలిపి పాదాలకు పూత వేసి.. పావుగంటయ్యాక కడిగి మాయిశ్చరైజర్‌ రాయాలి. తరచూ ఇలా చేయడం వల్ల చర్మం మీద మృతకణాలు తొలగిపోయి.. మృదువుగా మారతాయి.

follow these wonderful home remedies if you have dry legs

గులాబీ నీళ్లు, గ్లిజరిన్‌ సమపాళ్లలో తీసుకొని పాదాలకు మసాజ్ చేయాలి. మర్నాడు గోరువెచ్చటినీళ్లలో షాంపూ కలిపి కడిగితే.. పాదాల మీద మురికి సులువుగా తొలగిపోతుంది. ఫుట్‌క్రీమ్‌కానీ, లోషన్‌గానీ, పాదాలకు రాసుకోవచ్చు. ఫుట్‌లోషన్‌ను ఎలా తయారు చేయాలంటే గాఢమైన రంగున్న సీసాను సిద్ధం చేసుకోండి. అందులో ఒక చెమ్చా బాదం ఆయిల్‌, ఒక చెమ్చా ఆలివ్‌ ఆయిల్‌, ఒక చెమ్చా వీట్‌ ఓర్మ్‌ఆయిల్‌; 12 చుక్కల యూకలిప్టస్‌ ఎసెన్షియల్‌ ఆయిల్‌ను కలపండి. చల్లని నీడ ఉన్న ప్రదేశంలో దీన్ని వుంచండి. పాదాలను శుభ్రం చేసుకున్న తర్వాత ఆరిపోయాక ఈ ఆయిల్‌ను పట్టించండి. పాదాలను ఎంత శుభ్రంగా ఉంచుతామో కాలి వేళ్ళు, గోళ్ళు కూడా అంతే శుభ్రంగా ఉండటానికి ప్రాధాన్యత ఇవ్వండి. గోళ్ళు తరచూ కట్ చేసుకొంటుండాలి.

ఆ తర్వాత ఒక బకెట్లో పావు భాగం వరకు నీళ్ళు తీసుకుని అందులో ఒక స్పూన్ కొబ్బరి నూనె, ఒక స్పూన్ విటమిన్ ఇ నూనె, చెంచ వంటసోడా వేసి ఒక అరగంట పాటు కాళ్ళు అందులో ఉంచాలి. ఇలా చేస్తే పాదాలు మృదువుగా ఉంటాయి. ప్రతిరోజూ స్నానం చేసేటపుడు కనీసం మూడు నిమిషాలైనా పాదాలకోసం కేటాయించండి. పాదాలను ప్యూమిన్ రాయితో రుద్దితే మృతచర్మం చాలావరకు తొలగిపోతుంది. ప్యూమిస్‌ రాయి, నెయిల్ బ్రష్, మంచి స్క్రబ్ కొని తెచ్చుకోవాలి. బ్రష్‌తో గోళ్లలో ఉండే మట్టిని తొలగించవచ్చు. స్నానం పూర్తయ్యాక వేళ్ల మధ్య, అరికాలు పూర్తిగా తుడుచుకుని మంచి మాయిశ్చరైజర్ రాయాలి. పాదాల సంరక్షణలో భాగంగా సాక్సులు వాడుతుంటారు చాలామంది. వాటిని ఎప్పటికప్పుడు శుభ్రపరిచి ధరించాలి. లేదంటే దుమ్ము, మురికి చేరిపోయి చెమట పట్టినప్పుడు పాదాలకు ఇన్‌ఫెక్షన్‌ సోకే అవకాశం ఉంటుంది.

అలానే నైలాన్‌ సాక్సుల కంటే కాటన్‌వి సౌకర్యంగా ఉంటాయి. రాత్రిపూట తప్పనిసరిగా గోరువెచ్చటి నీళ్లతో కాళ్లు కడుక్కొని పొడి తువాలుతో తుడిచి కొబ్బరి నూనె రాయాలి. కొద్దిసేపు పాదాలను మునివేళ్లతో నొక్కుతూ ఉంటే రక్తప్రసరణ చక్కగా జరుగుతుంది. మర్నాటికి పాదాలు మెత్తబడతాయి.

Tags: dry legs
Previous Post

టాటూ వేయించుకుంటున్నారా..? అయితే జాగ్ర‌త్త‌ల‌ను పాటించ‌డం మ‌రిచిపోకండి..!

Next Post

ఆరోగ్యానికి ఏడు అద్భుతమైన ఆహారాలు…!

Related Posts

lifestyle

కేజీ ప‌ల్లీల ధ‌ర రూ.180, ప‌ల్లి నూనెను కేజీకి రూ.150కి ఎలా అమ్ముతున్నారు..?

July 1, 2025
Home Tips

మీ ఫ్రిజ్ నుంచి దుర్వాస‌న వ‌స్తుందా.. అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

July 1, 2025
ఆధ్యాత్మికం

మీకు ఇలాంటి క‌ల‌లు వ‌స్తున్నాయా..? అయితే మీ స‌మస్య‌లు త్వ‌ర‌లో పోతాయ‌ని అర్థం..!

July 1, 2025
పోష‌ణ‌

ఈ ఒక్కటి తింటే చాలు ఈ కాలంలో సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు..!!

July 1, 2025
technology

WI-FI రూటర్ వేగానికి చిన్న ట్రిక్స్.. రెప్పపాటులో హెచ్‌డీ వీడియోలు డౌన్‌లోడ్

July 1, 2025
హెల్త్ టిప్స్

మద్యం సేవిస్తున్న సాయంలో పొరపాటున కూడా తినకూడని 5 పదార్థాలు ! మీ ఆరోగ్యానికే ముప్పు జాగ్రత్త !

July 1, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.