Pippi Pannu : పిప్పి పళ్లు అనేవి సహజంగానే చాలా మందికి ఉంటాయి. ఇవి ఏర్పడేందుకు అనేక కారణాలు ఉంటాయి. ఫ్లోరైడ్ సమస్య వల్ల కొందరి దంత క్షయం ఏర్పడి అందులో ఆహార పదార్థాలు ఇరుక్కుని పిప్పి పన్ను సమస్య వస్తుంది. ఇక కొందరికి పలు భిన్న కారణాల వల్ల దంతాలు పుచ్చు పడుతుంటాయి. దీంతో అవి పిప్పి పళ్లుగా మారుతుంటాయి. అయితే కింద తెలిపిన చిట్కాలను పాటిస్తే దాంతో పిప్పి పన్ను సమస్య నుంచి సులభంగా బయట పడవచ్చు. మరి అందుకు ఏం చేయాలంటే..
ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిని తీసుకుని అందులో కొద్దిగా పటిక పడి కలపాలి. అనంతరం ఆ నీటిని నోట్లో పోసుకుని బాగా పుక్కిలించాలి. సుమారుగా 30 నుంచి 40 సెకన్ల వరకూ బాగా పుక్కిలించి తరువాత నీటిని ఉమ్మేయాలి. ఇలా గ్లాసులో ఉన్న నీరు అయిపోయే వరకు కొద్ది కొద్దిగా తీసుకుని పుక్కిలిస్తూ ఉమ్మేయాల్సి ఉంటుంది. దీంతో నోట్లో ఉండే బాక్టీరియా మొత్తం నశిస్తుంది. పిప్పి పళ్లకు కారణం అయ్యే సూక్ష్మ జీవులు చనిపోతాయి.
ఇక పావు టీస్పూన్ పటిక పొడిని తీసుకుని కొద్దిగా ఆవనూనె కలిపి మెత్తని పేస్ట్‌లా చేయాలి. అనంతరం ఒక కాటన్ బాల్ సహాయంతో మీ చేతి వేలితో కొద్దిగా తీసుకుని పిప్పి పన్ను ఉన్న చోట రాయాలి. తరువాత 5 నిమిషాలు అలాగే ఉండాలి. అనంతరం గోరు వెచ్చని నీటిని నోట్లో పోసుకుని పుక్కిలించాలి. ఇలా రెండు రోజులకు ఒకసారి చేస్తుండాలి. దీంతో పది రోజుల్లోనే ఈ సమస్య నుంచి పరిష్కారం లభిస్తుంది.
సాధారణంగా మనం తినే ఆహారాలు కొన్ని సార్లు దంతాల మూలల్లో చిక్కుకుని మనం ఎంత శుభ్రం చేసినా పోకుండా అలాగే ఉంటాయి. దీంతో క్రమంగా వాటి వల్ల దంత క్షయం ఏర్పడుతుంది. అక్కడ బాక్టీరియా చేరుతుంది. అనంతరం అది పిప్పి పన్నుగా మారుతుంది. దీంతో దంతాలు తీవ్రమైన నొప్పి కలుగుతాయి.
అయితే పటికతో ఈ విధంగా చేయడం వల్ల సూక్ష్మ జీవులు చనిపోతాయి. దంతాలు శుభ్రంగా మారుతాయి. క్రమంగా ఇన్‌ఫెక్షన్ తగ్గుతుంది. దీంతో పిప్పి పన్ను సమస్య నుంచి బయట పడవచ్చు. ఇక పిప్పి పన్ను సమస్య లేకున్నా.. తరచూ ఇలా పటికతో చేస్తుంటే ఆ సమస్య రాకుండా ముందుగానే జాగ్రత్త పడవచ్చు. దంతాలు, చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.