Belly Fat : మనలో చాలా మంది అధిక బరువుతో బాధపడుతూ ఉంటారు. ఈ సమస్యతో బాధపడే వారిలో చాలా మందికి పొట్ట చుట్టూ కొవ్వు అధికంగా పేరుకుపోతూ ఉంటుంది. కొందరిలో శరీరం అంతా సన్నగా ఉన్నా పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోయి పొట్ట ఒక్కటే లావుగా కనబడుతుంది. దీని వల్ల వారు చూడడానికి అందవిహీనంగా కనబడుతూ ఉంటారు. పొట్ట దగ్గర ఉండే కొవ్వు కరిగి నడుము సన్నగా నాజుగ్గా కనబడడానికి వారు చేయని ప్రయత్నం అంటూ ఉండదు. పొట్ట దగ్గర ఉండే కొవ్వును కరిగించడానికి రకరకాల వ్యాయామాలను చేస్తూ ఉంటారు. అదే విధంగా అనేక రకాల డైట్ లను కూడా పాటిస్తూ ఉంటారు. ఇవే కాకుండా ఆయుర్వేదం ద్వారా కూడా మనం మన పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించుకోవచ్చు.
చాలా సులువగా , చాలా తక్కువ ఖర్చుతో మన నడుమును సన్నగా నాజుకుగా తయారు చేసుకోవచ్చు. దీని కోసం మనం సర్వ రోగనివారిణి అయిన ఉత్తరేణిని ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ ఉత్తరేణిని ఉపయోగించి పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించుకోవచ్చు. ఉత్తరేణిని ఉపయోగించి పొట్ట చుట్టూ ఉండే కొవ్వును ఎలా కరిగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తరేణి మొక్క రసాన్ని తీసుకుని దానికి సమపాళ్లలో నువ్వుల నూనెను కలిపి కేవలం నూనె మిగిలే వరకు మరిగించి అది చల్లగా అయిన తరువాత నిల్వ చేసుకోవాలి. దీనిని రోజూ రాత్రి పడుకునే ముందు పొట్ట చుట్టూ రాసుకోవడం వల్ల క్రమక్రమంగా పొట్టు చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరిగి నడుము సన్నగా నాజుగ్గా తయారవుతుంది.
అంతేకాకుండా ఈ మొక్కను ఉపయోగించి అనేక రకాల వ్యాధులను నయం చేసుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేదంలో దీనిని ఉపయోగించి అనేక రోగాలు నయం చేస్తూ ఉంటారు. ఉత్తరేణి ఆకుల రసాన్ని గాయాలపై రాయడం వల్ల గాయాల నుండి రక్తం కారడం తగ్గుతుంది. గాయాలు కూడా త్వరగా మానుతాయి. ఈ ఆకుల రసాన్ని చర్మం పై రాసుకోవడం వల్ల దురదలు, దద్దుర్లు, పొక్కులు, చర్మం పొట్టు రాలడం వంటి సమస్యలు తగ్గుతాయి. కందిరీగలు, తేనెటీగలు, తేలు కుట్టినప్పడు ఉత్తరేణి ఆకులను ముద్దగా చేసి ఇవి కుట్టిన చోట ఉంచడం వల్ల నొప్పి తగ్గుతుంది.
ఉత్తరేణి గింజలను పొడిగా చేసి వాటికి ఉప్పును, పటికబెల్లం పొడిని, వంట కర్పూరం పొడిని కలిపి వాడడం వల్ల దంతాల నొప్పులు, చిగుళ్ల నుండి రక్తం కారడం వంటి సమస్యలు తగ్గడంతోపాటు దంతాలు దృఢంగా మారుతాయి. అంతే కాకుండా దంతాలు తెల్లగా కూడా మారుతాయి. ఈ మొక్కను కాల్చిన తరువాత వచ్చే బూడిదకు ఆముదాన్ని కలిపి లేపనంగా రాయడం వల్ల గజ్జి, తామర వంటి చర్మ వ్యాధులు తగ్గుతాయి. ఈ బూడిదలో తేనె కలిపి తీసుకుంటే గుండె సంబంధిత సమస్యలతోపాటు దగ్గు, ఉబ్బసం, ఊపిరితిత్తులల్లో శ్లేష్మం పేరుకుపోవడం వంటి సమస్యలు తగ్గుతాయి.
అదే విధంగా ఈ బూడిదను మజ్జిగలో కలుపుకుని తాగడం వల్ల రక్త విరేచనాలు తగ్గుతాయి. ఉత్తరేణి మొక్క చూర్ణానికి ఆవు నెయ్యిని కలిపి తీసుకోవడం వల్ల పురుషులల్లో వచ్చే పౌరుష గ్రంథి వాపు తగ్గుతుంది. ఉత్తరేణి మొక్క వేర్లను కాల్చి చూర్ణంగా చేసి దానికి మిరియాల పొడిని కలిపి మాత్రలుగా చేసుకోవాలి. ఈ మాత్రలను రోజుకు రెండు పూటలా తీసుకుంటూ ఉండడం వల్ల చర్మ రుగ్మతలు తగ్గుతాయి. ఈ విధంగా ఉత్తరేణి మొక్కను ఉపయోగించి పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగేలా చేయడమే కాకుండా అనేక రకాల అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.