Breast Size : మనలో చాలా మంది స్త్రీలు వక్షోజాల పరిమాణం చిన్నగా ఉన్నది బాధపడుతూ ఉంటారు. వక్షోజాల పరిమాణం చిన్నగా ఉండడానికి వివిధ కారణాలు ఉంటాయి. పోషకాహార లోపం, హార్మోన్ల అసమతుల్యత వంటి వివిధ కారణాల చేత వక్షోజాలు చిన్నగా ఉంటాయి. కొందరిలో వంశపారపర్యంగా కూడా వక్షోజాలు చిన్నగా ఉంటాయి. వక్షోజాల పరిమాణం చిన్నగా ఉందని బాధపడే స్త్రీలు ఒక చక్కటి చిట్కాను వాడడం వల్ల చాలా సులభంగా వక్షోజాల పరిమాణాన్ని పెంచుకోవచ్చు. అలాగే ఈ చిట్కాను వాడడం వల్ల వక్షోజాలు బిగుతుగా కూడా మారతాయి. వక్షోజాల పరిమాణాన్ని పెంచే ఈ చిట్కా ఏమిటి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ మనం 4 టీ స్పూన్ల ఆవ నూనెను, ఒక టీ స్పూన్ మెంతులను, ఒక టీ స్పూన్ పటిక పొడిని ఉపయోగించాల్సి ఉంటుంది. పటిక అనగానే చాలా మంది పటిక బెల్లం అనుకుంటారు. కానీ పటిక మరియు పటిక బెల్లం వేరుగా ఉంటాయి. పటిక మనకు ఆయుర్వేద షాపుల్లో ఎక్కువగా లభిస్తుంది. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ ముందుగా ఒక గిన్నెలో ఆవ నూనెను వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక మెంతులను వేసి వేయించాలి. మెంతులు బ్రౌన్ కలర్ లోకి వచ్చే వరకు వేయించిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని 7 నుండి 8 గంటల పాటు అలాగే ఉంచాలి. ఇలా 8 గంటల పాటు ఉంచిన తరువాత ఈ నూనెను వడకట్టుకుని తీసుకోవాలి. తరువాత ఈ నూనెలో ఒక టీ స్పూన్ పటిక పొడిని వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న నూనెను రోజూ రాత్రి పడుకునే ముందు వక్షోజాలకు రాసుకోవాలి.
వక్షోజాలపై నెమ్మదిగా ఒత్తిడిని కలిగించకుండా వక్షోజాలను పైకి అనుకుంటూ రాసుకోవాలి. ఇలా 10 నిమిషాల పాటు నూనెను రాసుకున్న తరువాత బిగుతుగా ఉండేలా బ్రాను వేసుకుని నిద్రించాలి. ఉదయాన్నే వక్షోజాలను నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా 15 నుండి నెల రోజుల పాటు చేయడం వల్ల వక్షోజాలు పెద్దగా, బిగుతుగా తయారవుతాయి. అలాగే మెంతులను పేస్ట్ గా చేసి రాసుకున్నా లేదా మెంతుల నీటిని తాగినా కూడా మంచి ఫలితం ఉంటుంది. ఈ చిట్కాను వాడడంతో పాటు బాదంపప్పు, వాల్ నట్స్ వంటి వాటిని ఎక్కువగా తినాలి. అలాగే సోయా పదార్థాలను కూడా ఎక్కువగా తీసుకోవాలి. ఈ విధంగా ఈ చిట్కాను వాడడం వల్ల చాలా సులభంగా వక్షోజాల పరిమాణాన్ని పెంచుకోవచ్చు.