Mukku Dibbada : చలికాలంలో నిద్ర లేవగానే ఒళ్లంతా పట్టేసినట్టు ఉంటుంది. నడుము కూడా పట్టేసినట్టు ఉంటుంది. వీటితో పాటు ముక్కు కూడా పట్టేస్తుంది. ముక్కు బిగుసుకుపోయినట్టు ఉంటుంది. ముక్కలో శ్లేష్మాలు బిగుసుకుపోయి ఊపిరి ఆడనట్టు ఉంటుంది. ముక్కునుండి నీరు కారినట్టు ఉంటుంది. చలికాలంలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. కొందరిలో ఈ సమస్య కొంత సమయం వరకు ఉండి వెంటనే తగ్గిపోతుంది. కానీ కొందరిలో ఈ సమస్య రోజంతా అలాగే ఉంటుంది. చలికాలంలో నిద్రలేవగానే ముక్కు పట్టేసినట్టు, ముక్కు బిగుసుకుపోయినట్టు ఉండే ఈ లక్షణాలను ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. చలికాలంలో వచ్చే ముక్కు దిబ్బడ, ముక్క పట్టేసినట్టు ఉండే లక్షణాలు తగ్గాలంటే గోరు వెచ్చని నీటి కంటే కొద్దిగా ఎక్కువ వేడిగా ఉండే నీటిని తాగాలి. దీని వల్ల శ్లేష్మాలు పలుచబడి ముక్కు దిబ్బడ తగ్గుతుంది. తరువాత వేడి నీటిలో యూకలిప్టస్ నూనెను లేదా పెప్పర్ మెంట్ నూనెను, పసుపును వేసి ఆవిరి పట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ముక్కు బిగింపు తగ్గుతుంది.
తరువాత ముక్కు బిగుసుకుపోయినప్పటికి మనసు పెట్టి ముక్కుతోనే వీలైనంత ఎక్కువగా గాలి పీల్చడానికి ప్రయత్నించాలి. ముక్కతో ఎక్కువగా గాల్చి పీల్చడం వల్ల ముక్కలో ఉన్న శ్లేష్మాలు ఆవిరైపోతాయి. దీంతో ముక్కు దిబ్బడ తగ్గుతుంది. ఇలా చేసిన తరువాత ముక్కు కొద్దిగా వదులుగా అవుతుంది. తరువాత 10 నుండి 15 నిమిషాల పాటు ప్రాణాయామం చేయాలి. ఇలా చేయడం వల్ల మనం చాలా త్వరగా ముక్కుదిబ్బడ నుండి బయటపడవచ్చు. లేదంటే ముక్కు నుండి నీరు కారుతూ, జలుబు చేసినట్టు రోజంతా అలాగే ఉంటుంది. ఉదయం నిద్రలేవగానే ముక్కు దిబ్బడను తగ్గించుకోకపోతే ముక్కు పట్టేసి రోజంతా అసౌకర్యంగా ఉంటుంది. చాలా మంది ఈ సమస్య నుండి బయటపడడానికి ఉదయాన్నే చాలా మంది టీ, కాఫీలను తాగుతూ ఉంటారు.
ఉదయం పూట పరగడుపున టీ, కాఫీలను తాగడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది. ఒక చిన్న మందును కూడా వాడకుండా సహజ సిద్దంగా ఈ చిట్కాలను వాడి మనం ముక్కు దిబ్బడను తగ్గించుకోవచ్చు. ఈ చిట్కాలను వాడడం వల్ల మనకు ఎటువంటి దుష్ప్రభావాలు కలగకుండా ఉంటాయి. ఈ చిట్కాలను చిన్న పిల్లల నుండి పెద్ద వారి వరకు ఎవరైనా వాడవచ్చు. ముక్కు దిబ్బడతో రోజంతా ఇబ్బంది పడడానికి బదులుగా ఈ చిట్కానలు వాడి వెంటనే తగ్గించుకోవడం మంచిది.