Mulleti Powder : మనకు ఆహారం, నీరు ఎంత అవసరమో ఆక్సిజన్ కూడా అంతే అవసరం. ఆహారం, నీరు లేకపోయినా మనం జీవించగలుగుతాము కానీ ఆక్సిజన్ లేకుంటే మనం రెండు నిమిషాల పాటు కూడా జీవించలేము. ఊపిరితిత్తుల సమస్యలు అలాగే ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్స్ వంటి సమస్యలతో బాధపడే వారికి ఆక్సి.న్ సరిగ్గా అందదు. వారు శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆక్సిజన్ సరిగ్గా అందకపోవడం వల్ల వెంటనే శరీరం నీరసించి పోతుంది. చర్మం, పెదవులు రంగు మారుతాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే శరీరంలో ఆక్సిజన్ తక్కువగా ఉందని భావించాలి. కరోనాతో బాధపడే వారిలో ఎక్కువగా ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఈ చక్కటి చిట్కాను వాడడం వల్ల శరీరంలో ఆక్సిజన్ స్థాయిలను సులభంగా పెంచుకోవచ్చు.
ఈ చిట్కాను కరోనాతో బాధపడే వారు అలాగే కరోనా లేని వారు కూడా పాటించవచ్చు. శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు తగిన మోతాదులో ఉండేలా చేయడంలో ఈ చిట్కా చక్కగా పని చేస్తుంది. శరీరంలో ఆక్సిజన్ స్థాయిలను పెంచే ఈ చిట్కాను ఎలా తయారు చేసుకోవాలి..అలాగే ఈ చిట్కాను ఎలా వాడాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ ముందుగా ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీటిని పోసి వేడి చేయాలి. తరువాత ఇందులో ఒక టీ స్పూన్ ముల్లేటి పొడిని వేయాలి. తరువాత ఈ నీటిని ఒక గ్లాస్ అయ్యే వరకు బాగా మరిగించాలి. నీళ్లు బాగా మరిగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి నీటిని వడకట్టుకోవాలి. తరువాత ఈ నీటిలో ఒక టీ స్పూన్ అల్లం రసం, ఒక టీ స్పూన్ నిమ్మరసం వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న పానీయాన్ని రోజూ ఉదయం పరగడుపున తీసుకోవాలి.
అవసరం ఉన్న వారు రోజుకు రెండు సార్లు కూడా ఈ పానీయాన్ని తీసుకోవచ్చు. ఈ పానీయాన్ని తీసుకోవడం వల్ల శ్వాస సంబంధిత సమస్యలు తగ్గుతాయి. శరీరంలో మలినాలు తొలగిపోతాయి. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీనిని తీసుకున్న మొదటి రోజే మనం మన శరీరంలో వచ్చిన మార్పును గమనించవచ్చు. అయితే గర్భిణీ స్త్రీలు మాత్రం దీనిని తీసుకోకూడదు. ఈ పానీయాన్ని తాగుతూనే ఆక్సిజన్ శాతాన్నిపెంచుకోవడానికి గానూ ప్రాణాయామం, యోగా వంటివి చేయాలి. అలాగే బస్త్రికా ప్రాణాయామాన్ని రోజూ 15 నుండి 20 నిమిషాల పాటు చేయాలి. అలాగే కరోనా వ్యాధి గ్రస్తుల్లో ఆక్సిజన్ శాతం తక్కువగా ఉన్నప్పుడు ప్రోనింగ్ పద్దతిని పాటించాలి. బోర్లా పడుకుని ఉదరం మీద బరువు వేయడమే ప్రోనింగ్.
ఇలా చేయడం వల్ల శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు పెరుగుతాయి. అలాగే ఆక్సిజన్ స్థాయిలు తక్కువగా ఉన్నప్పుడు ఆవిరి పట్టాలి. ఆవిరి పట్టడం వల్ల శ్వాస మార్గంలో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. దీని కోసం ఒక గిన్నెలో నీటిని తీసుకుని వేడి చేయాలి. ఇందులో వాము, కొద్దిగా పసుపు వేసి ఈ నీటిని బాగా మరిగించాలి. తరువాత ముఖం మీద దుప్పటిని వేసుకుని ఈ నీటితో ఆవిరి పట్టాలి. ఇలా ఈ చిట్కాలను పాటించడం వల్ల చాలా సులభంగా శరీరంలో ఆక్సిజన్ స్థాయిలను పెంచుకోవచ్చు.