Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Dhaba Style Palak Dal : ధాబా స్టైల్‌లో పాల‌క్ దాల్‌ను ఇలా చేయండి.. చ‌పాతీల్లోకి సూప‌ర్‌గా ఉంటుంది..!

D by D
March 31, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Dhaba Style Palak Dal : మ‌నం పాల‌కూర‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. పాల‌కూర మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల‌తో పాటు ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. పాల‌కూర‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. పాల‌కూర‌తో చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది. మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ పాల‌కూర‌తో ధాభా స్టైల్ లో పాల‌క్ దాల్ ఫ్రైను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

పాల‌క్ దాల్ ఫ్రై త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

కందిప‌ప్పు – 100 గ్రా., చిన్న పాల‌కూర క‌ట్ట‌లు – 4, త‌రిగిన ఉల్లిపాయ – 1, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 4, దంచిన వెల్లుల్లి రెబ్బలు – 6,,ప‌సుపు – అర టీ స్పూన్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 1, నాన‌బెట్టిన చింత‌పండు – చిన్న నిమ్మ‌కాయంత‌, కారం – ఒక టేబుల్ స్పూన్, నూనె – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, క‌రివేపాకు – ఒక రెమ్మ‌.

Dhaba Style Palak Dal recipe in telugu tastes better with chapati
Dhaba Style Palak Dal

పాల‌క్ దాల్ ఫ్రై త‌యారీ విధానం..

ముందుగా కుక్క‌ర్ లో క‌డిగిన కందిపప్పు, ఒక గ్లాస్ నీళ్లు పోసి మూత పెట్టాలి. త‌రువాత ఈ ప‌ప్పును 3 విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించుకోవాలి. త‌రువాత మూత తీసి పప్పును మెత్త‌గా చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బ‌లు, క‌రివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. తాళింపు వేగిన త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు వేగిన త‌రువాత పాల‌కూర వేసి క‌ల‌పాలి. పాల‌కూర‌లో నీరంతా పోయి పాల‌కూర వేగిన త‌రువాత ఉప్పు, కారం, ప‌సుపు వేసి క‌ల‌పాలి. త‌రువాత ఉడికించిన కందిప‌ప్పు, చింత‌పండు ర‌సం వేసి క‌ల‌పాలి.

త‌రువాత ఒక గ్లాస్ లేదా త‌గిన‌న్ని నీళ్లు పోసి క‌ల‌పాలి. త‌రువాత ఈ ప‌ప్పును మ‌రో 5 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే పాల‌క్ దాల్ ఫ్రై త‌యార‌వుతుంది. ఈ ప‌ప్పును అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. దీనిని తిన‌డం వ‌ల్ల మ‌నం రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు. అన్నం, చ‌పాతీ, రోటి వంటి వాటితో క‌లిపి తింటే ఈ ప‌ప్పు చాలా రుచిగా ఉంటుంది.

Tags: Dhaba Style Palak Dal
Previous Post

Mulleti Powder : ఊపిరితిత్తుల‌ను క్లీన్ చేసి ఆక్సిజ‌న్ లెవ‌ల్స్‌ను పెంచే చిట్కా ఇది.. ఏం చేయాలంటే..?

Next Post

Kuska Rice : ఉడ‌క‌బెట్టిన కోడిగుడ్ల‌తో చేసే కుష్కా రైస్ గురించి తెలుసా.. రుచి చూస్తే వ‌ద‌ల‌రు..!

Related Posts

ఆధ్యాత్మికం

మీ ఇంటి వద్ద‌కు వ‌చ్చి కాకి ప‌దే ప‌దే అరుస్తుందా..? దాని అర్థం ఏమిటంటే..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దేశంలో ఉన్న 18 అష్టాద‌శ శ‌క్తి పీఠాలు ఎక్క‌డ ఉన్నాయి..? అవి ఏమిటి..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దీపారాధ‌న‌కు అస‌లు ఏ నూనె వాడాలి..? దీపారాధ‌న ఎలా చెయ్యాలి..?

July 4, 2025
వినోదం

70 ఏళ్ల వ‌య‌స్సులోనూ ర‌జ‌నీకాంత్ అంత ఫిట్‌గా ఉన్నారంటే..? ఆయ‌న పాటించే దిన‌చ‌ర్య ఎలాంటిదంటే..?

July 4, 2025
technology

స్మార్ట్‌ఫోన్ల పై భాగంలో ఉండే రంధ్రాన్ని ఎప్పుడైనా గ‌మ‌నించారా..? అదేమిటో తెలుసా..?

July 4, 2025
lifestyle

బుల్లెట్ బైక్‌ నే దేవుడిగా చేసి, పూజలు చేస్తున్న గ్రామస్తులు, దీని వెనక పెద్ద కథే ఉంది.!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.