Rice Water For Hair : ప్రస్తుత కాలంలో చాలా మంది జుట్టు రాలడం అనే సమస్యతో బాధపడుతున్నారు. తలస్నానం చేసినప్పుడు, జుట్టు దువ్వుకున్నప్పుడు కుచ్చులు కుచ్చులుగా జుట్టు రాలిపోతుందని చాలా మంది బాధపడుతున్నారు. జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉన్నాయి. పోషకాహార లోపం, వాతావరణ కాలుష్యం, రసాయనాలు కలిగిన షాంపులను, కండిష్ నర్ లను వాడడం, అలాగే బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్ ల కారణంగా కూడా జుట్టు రాలుతుంది. జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా పెరగడం కోసం మనం చేయని ప్రయత్నం అంటూ ఉండదు. జుట్టు రాలడాన్ని తగ్గించుకోవడం కోపం మనం ఎంతో ఖర్చు కూడా చేస్తూ ఉంటాం. ఎటువంటి ఖర్చు లేకుండా చాలా సులభంగా ఒక చిన్న ఇంటి చిట్కాను ఉపయోగించి మనం ఈ సమస్య నుండి బయట పడవచ్చు.
జుట్టు రాలడం అనే సమస్యతో బాధపడే వారు అన్నం వార్చగా వచ్చిన గంజిని వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అన్నం వార్చగా వచ్చిన గంజిలో అనేక పోషకాలు ఉంటాయని మనందరికి తెలిసిందే. ఈ గంజిని పూర్వాకాలంలో ఆహారంగా కూడా తీసుకునే వారు. దీనిని తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు కూడా తెలియజేసారు. ఆరోగ్యంతో పాటు జుట్టును సంరక్షించడంలో కూడా ఈ గంజి ఉపయోగపడుతుందని నిపుణులు జరిపిన పరిశోధనల్లో వెల్లడైంది. గంజిలో ఉండే ఇనోసిటాల్ అనే మూలకం జుట్టు కుదుళ్లను బలంగా చేసి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుందని పరిశోధనల్లో నిరూపితమైంది. అన్నం వార్చగా వచ్చిన గంజిని జుట్టు కుదుళ్ల నఉండి చివరి వరకు పట్టించాలి.
తరువాత జుట్టును ముడి వేసుకుని ఆరే వరకు అలాగే ఉండాలి. గంజి మొత్తం పూర్తిగా ఆరిపోయిన తరువాత రసాయనాలు తక్కువగా ఉండే షాంపుతో తలస్నానం చేయాలి. ఇలా వారినికి రెండు నుండి మూడు సార్లు చేయడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. జుట్టు రాలడం, జుట్టు చిట్లడం, జుట్టు పొడి బారడం వంటి సమస్యలు తగ్గుతాయి. అదేవిధంగా గంజిని ఉపయోగించడం వల్ల తల చర్మం పై ఉండే ఇన్ఫెక్షన్ లు తగ్గి జుట్టు కుదుళ్లు బలంగా తయారవుతాయి. గంజి జుట్టుకు ఒక కండిషనర్ గా పని చేసి జుట్టును మృదువుగా, కాంతివంతంగా మారుస్తుంది. గంజి నీరు మరీ పలుచగా ఉంటే దీనిని కొద్ది ఉడికించి చిక్కబడిన తరువాత జుట్టుకు రాసుకోవాలి.
కేవలం జుట్టును సంరక్షించడంలోనే కాకుండా చర్మాన్ని కాపాడడంలో కూడా గంజి మనకు ఉపయోగపడుతుంది. గంజిలో పసుపును ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. ఆరిన తరువాత నీటితో కడిగి వేయాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉండే మచ్చలు, మొటిమలు తగ్గి చర్మం రంగు కూడా మెరుగుపడుతుంది. ఈ విధంగా గంజి మన ఆరోగ్యాన్ని, అందాన్ని కాపాడడంలో ఎంతగానో ఉపయోగపడుతుందని దీనిని వాడడం వల్ల మనం చక్కటి ఫలితాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.