Holy Basil Leaves : మూత్రాశయ సంబంధిత సమస్యలతో బాధపడే వారి సంఖ్య ప్రస్తుత కాలంలో రోజురోజుకూ ఎక్కువువుతోంది. మనల్ని వేధించే అనారోగ్య సమస్యల్లో అతి మూత్ర వ్యాధి కూడా ఒకటి. ఈ సమస్య రావడానికి ప్రధాన కారణం యూరినరీ ట్రాక్ ఇన్ ఫెక్షన్ (యూటీఐ) అని వైద్యనిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఒక ఆరోగ్యవంతుడైన మనిషి రోజులో 5 నుండి 6 సార్లు మాత్రమే మూత్ర విసర్జన చేస్తారు. అంతకంటే రెట్టింపు మూత్ర విసర్జన చేసినా అలాగే మూత్ర విసర్జన సమయంలో నొప్పి, మంట వంటి భావన కలిగిన కూడా మనం మూత్రాశయ ఇన్ ఫెక్షన్ బారిన పడ్డామని అర్థం.
ఇంటి చిట్కాలను ఉపయోగించి యూరినరీ ట్రాక్ ఇన్ ఫెక్షన్ నుండి ఎలా బయట పడాలి.. అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. అతిమూత్ర వ్యాధితో బాధపడే వారు ముందుగా ఒక గ్లాస్ నీటిలో అర టీ స్పూన్ బేకింగ్ సోడాను వేసి కలిపి తాగాలి. ఇలా చేయడం వల్ల ఇన్ ఫెక్షన్ కు కారణమయ్యే బాక్టీరియా వ్యాప్తి తగ్గి ఇన్ ఫెక్షన్ తగ్గు ముఖం పడుతుంది. ఇలా రోజుకు రెండు నుండి మూడు సార్లు బేకింగ్ సోడాను కలిపిన నీటిని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

ఈ చిట్కాను పాటించడంతోపాటు ప్రతిరోజూ ఉదయం 7 లేదా 8 తులసి ఆకులను నమిలి తిని ఆ తరువాత ఒక టీ స్పూన్ తేనెను కూడా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల చాలా తక్కువ సమయంలోనే అతి మూత్ర వ్యాధి తగ్గుతుంది. అలాగే మూత్రాశయంలో మంట, నొప్పి వంటి సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. అలాగే భవిష్యత్తులో ఈ సమస్య రాకుండా ఉండాలంటే నీటిని ఎక్కువగా తాగడం, ఇంట్లో లేదా బయట టాయిలెట్స్ ను ఉపయోగించేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోవడం వంటివి చేయడం వల్ల మూత్రాశయ ఇన్ ఫెక్షన్ ల బారిన పడకుండా ఉంటాం.