Constipation : రకరకాల అనారోగ్య సమస్యలతో మనం బాధపడుతూ ఉంటాము. చాలామంది ఎదుర్కొనే సమస్య మలబద్ధకం. మలబద్ధకం వలన ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. మలబద్ధకం సమస్య నుండి బయట పడాలంటే పీచు పదార్థాలని బాగా తీసుకోవాలి. శరీరానికి సరిపడా నీళ్లు, వ్యాయామం ఇవన్నీ కూడా ఈ సమస్య నుండి బయట పడడానికి సహాయపడతాయి. అయితే మలబద్ధకం సమస్య నుండి బయట పడాలంటే ఈ పండ్లను తీసుకోండి. అప్పుడు మలబద్ధకం నుండి వెంటనే బయటికి వచ్చేయొచ్చు.
ఆల్ బుకర పండ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఫైబర్, ఫైటో న్యూట్రియెంట్స్ ఎక్కువ ఉంటాయి. 100 గ్రాముల ఆల్ బుకర పండ్లలో 7 గ్రాముల ఫైబర్ ఉంటుంది. పేగు కదలికలని ఈజీ చేస్తుంది. మలబద్ధకం కారణంగా బాధపడే వాళ్ళు ఈ పండ్లు తీసుకుంటే మంచిది. 100 గ్రాముల పియర్స్ లో ఐదు శాతం ఫైబర్ ఉంటుంది. పియర్స్ ని తీసుకుంటే కూడా మలబద్ధకం నుండి దూరంగా ఉండొచ్చు.
విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా పియర్స్ లో ఎక్కువగా ఉంటాయి. అరటిపండ్లలో కూడా పోషకాలు ఎక్కువగా ఉంటాయి. 100 గ్రాముల అరటిపండ్లలో 3.1 గ్రాముల ఫైబర్ ఉంటుంది. మలబద్ధకంతో బాధపడేవాళ్లు అరటి పండ్లు తీసుకోవడం కూడా మంచిది. కివిని తీసుకుంటే కూడా ఈ సమస్య నుండి బయటకి వచ్చేయొచ్చు. 100 గ్రాముల కివిలో 2.5 గ్రాముల ఫైబర్ ఉంటుంది. పేగు కదలికలని ఈజీ చేస్తుంది.
మలం సులభంగా విసర్జన అయ్యేట్టు చేస్తుంది. అంజీర్ ని తీసుకుంటే కూడా మలబద్ధకం సమస్య ఉండదు. అంజీర్ లో కూడా పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అంజీర్ ని తీసుకోవడం వలన ఫైబర్ బాగా అందుతుంది. జీర్ణవ్యవస్థని అంజీర్ ఆరోగ్యంగా ఉంచుతుంది. రెగ్యులర్ గా ఈ పండ్లను మీరు డైట్ లో చేర్చుకున్నట్లైతే ఆరోగ్యం బాగుంటుంది. మలబద్ధకం సమస్య నుండి ఈజీగా బయటకి వచ్చేయొచ్చు. ఎలాంటి సమస్య ఉండదు.