Belly Fat : ప్రస్తుత తరుణంలో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. శారీరక శ్రమ చేయక పోవడం వల్ల, అధికంగా కొవ్వు కలిగిన పదార్థాలను తినడం వల్ల, మానసిక ఒత్తిడి వల్ల చాలా మంది ఊబకాయం బారిన పడుతున్నారు. ఊబకాయం, పొట్ట చుట్టు అధికంగా ఉండే కొవ్వు మనిషి అందాన్ని దెబ్బ తీయడమే కాకుండా అనేక అనారోగ్య సమస్యలు వచ్చేలా చేస్తాయి. అయితే సహజ సిద్దమైన పద్దతిలో ఇంట్లో ఉండే బెల్లం, నిమ్మకాయల ద్వారానే అధిక బరువును ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

బెల్లం మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. మన శరీరంలోని వ్యర్థాలను తొలగించి రోగ నిరోధక శక్తిని పెంచడంలో బెల్లం ఎంతో సహాయపడుతుంది. బెల్లాన్ని ఆహారంలో భాగంగా చేసుకోవడం ద్వారా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అనేక అనారోగ్య సమస్యలను తగ్గించడంలో నిమ్మకాయ ఉపయోగపడుతుంది. అధికంగా ఉన్న బరువును తగ్గించుకునేందుకు నిమ్మకాయను ఉపయోగించడం వల్ల ఫలితం ఎక్కువగా ఉంటుంది.
ఊబకాయం వల్ల గుండె సంబంధిత వ్యాధులు, హైబీపీ, శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగడం, షుగర్ వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని.. వైద్య నిపుణులు చెబుతున్నారు. అధిక బరువు తగ్గడానికి మనం తీసుకునే ఆహారంలో మార్పులు చేయడం చాలా అవసరం. దీని వల్ల బరువు తగ్గడమే కాకుండా శరీర మెటబాలిజం పెరుగుతుంది.
అధికంగా ఉన్న బరువును తగ్గించుకునేందుకు బెల్లాన్ని, నిమ్మ రసాన్ని కలిపి ఈ విధంగా తీసుకోవాలి. ఒక గ్లాసు నీటిని వేడి చేసి అందులో ఒక టీ స్పూన్ నిమ్మరసాన్ని, ఒక చిన్న బెల్లం ముక్కను వేసి బాగా కలపాలి. బెల్లం నీటిలో పూర్తిగా కరిగిన తరువాత ఆ నీటిని తాగాలి. ఇందులో పుదీనా ఆకులను కూడా వేసుకోవచ్చు. ఈ నీటిని ఎప్పుడు తాగాలి.. అనే సందేహం చాలా మందికి కలుగుతుంది. రోజూ ఉదయం పరగడుపున ఈ నీటిని తాగాలి. బెల్లం , నిమ్మరసం కలిపిన ఈ నీటిని తాగడం వల్ల అధిక బరువు వేగంగా తగ్గుతారు. శరీరంలోని కొవ్వు కరిగిపోతుంది. కొద్ది రోజుల్లోనే శరీరంలో మార్పు కనిపిస్తుంది. ఇది బరువు తగ్గేందుకు ఉపయోగపడే అద్భుతమైన చిట్కా అని చెప్పవచ్చు.