Weight Loss Remedy : మనలో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతూ ఉంటారు. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతున్నారు. అధిక బరువు, అధిక పొట్ట సమస్య తలెత్తడానికి అనేక కారణాలు ఉంటాయి. జంక్ ఫుడ్ ను తీసుకోవడం, నూనెలో వేయించిన పదార్థాలను తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం, మారిన జీవన విధానం వంటి వివిధ కారణాల చేత ఈ సమస్య తలెత్తుతుంది. అయితే చాలా మంది బరువు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. బరువు తగ్గాలనుకునే వారు ముందుగా ఒక విషయాన్ని తెలుసుకోవాలి. మనం రెండు సందర్భాలలో తొందరగా బరువు తగ్గుతారు. ఒకటి వ్యాయమం చేసేటప్పుడు, మరొకటి నిద్రపోయేటప్పుడు. నిద్రపోయేటప్పుడు మనం 800 గ్రాముల నుండి కిలో వరకు బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు.
అయితే నిద్రపోయేటప్పుడు కొన్ని జాగ్రత్తలను తీసుకుంటూ అలాగే ఒక చక్కటి చిట్కాను పాటించడం వల్ల మనం చాలా సులభంగా బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. నిద్రపోయే ముందు పాటించాల్సిన నియమాలు అలాగే చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రాత్రి పడుకునే ముందు భోజనాన్ని త్వరగా చేయాలి. అలాగే భోజనాన్ని తక్కువగా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల శరీరంలో ఉన్న కొవ్వు త్వరగా తగ్గుతుంది. అలాగే ఒక చక్కటి చిట్కాను పాటించాలి. ఈ చిట్కాను పాటించడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు వేగంగా కరిగిపోతుంది. ఈ చిట్కాను పాటించడం చాలా సులభం. అలాగే దీనిని మనం తయారు చేసుకుని నిల్వ కూడా చేసుకోవచ్చు. అధిక బరువును తగ్గించే చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ 25 గ్రా. అవిసె గింజలను, 25 గ్రా. జీలకర్రను, 50 గ్రా. అవిసె గింజలను, అర టేబుల్ స్పూన్ పసుపును, 25 గ్రా. కరివేపాకు పొడిని, 25 గ్రా. కరక్కాయ పొడిని, అర టేబుల్ స్పూన్ సైందవ లవణాన్ని, 2 చిటికెల ఇంగువను ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా కళాయిలో అవిసె గింజలను వేసి దోరగా వేయించాలి. వీటిని ప్లేట్ లోకి తీసుకున్న తరువాత జీలకర్రను, సోంపు గింజలను కూడా విడివిడిగా వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత వేయించిన పదార్థాలతో పాటు మిగిలిన పదార్థాలను కూడా జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా తయారు చేసిన పొడిని గాజు సీసాలో నిల్వ కూడా చేసుకోవచ్చు. ఇలా తయారు చేసిన పొడిని రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ వేడి నీటిలో పావు టేబుల్ స్పూన్ మోతాదులో కలిపి తీసుకోవాలి.
నీళ్లు గోరు వెచ్చగా కంటే కొద్దిగా వేడి ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇలా రోజూ రాత్రి పడుకునే ముందు తీసుకోవడం వల్ల మనం చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. బరువు మరీ ఎక్కువ ఉన్న వారు దీనిని రోజూ మూడు పూటలా పావు టేబుల్ స్పూన్ మోతాదులో భోజనం చేసిన గంట తరువాత తీసుకోవాలి. అలాగే ఈ పొడిని తీసుకునేటప్పుడు ఎటువంటి జంక్ ఫుడ్ ను తీసుకోకూడదు. వ్యాయామం చేయాలి. తీపి పదార్థాలకు, నూనెలో వేయించిన పదార్థాలకు దూరంగా ఉండాలి. ఈ విధంగా ఈ చిట్కాను రాత్రి పడుకునే ముందు పాటించడం వల్ల చాలా సులభంగా బరువు తగ్గవచ్చు.