కూరగాయాలు, ఆకుకూరలు మనం నిత్యం తీసుకునే ఆహార పదార్దాలలో భాగం. అధిక దిగుబడి కోసం రసాయన ఎరువుల వాడకం ఎక్కువయింది. కూరగాయలు ఎక్కువ కాలం నిల్వ ఉండాలని కూడా రకరకాల కెమికల్స్ వాడుతుంటారు. వాటిని డైరెక్ట్ గా తీసుకుంటే అనేక దుష్పరిమాణాలు కలుగుతాయి. అలా కాకుండా కూరగాయలపై ఉన్న పెస్టిసైడ్స్ ను క్లీన్ చేయడానికి వివిధ పద్దతులు అందుబాటులో ఉన్నాయి. అవేమిటంటే.. మనలో చాలామంది చల్లటి నీటిలో కూరగాయలను వేసి కడుగుతారు. చల్లని నీటిలో వేసినప్పటికీ వాటిని బాగా స్క్రబ్ చేస్తేనే కూరగాయలపై ఉన్న రసాయనాలను తొలగించగలుగుతాం.
కూరగాయలపై పెస్టిసైడ్స్ ను క్లీన్ చేయడానికి ఉప్పు నీరు మనకు చాలా హెల్ప్ చేస్తుంది. గోరువెచ్చని నీటిలో రెండు స్పూన్ల ఉప్పు వేసి అరగంట పాటు కూరగాయలను అందులో వేసి తర్వాత వాడుకుంటే పెస్టిసైడ్స్ సమూలంగా తొలగిపోతాయి. కూరగాయలపై పెస్టిసైడ్స్ ను తొలగించడానికి వెనిగర్ బాగా ఉపయోగపడుతుంది. దీనికోసం మీరు చేయాల్సింది ఒక కప్ వెనిగర్ చేర్చి ఆ వాటర్ లో కూరగాయలు నానబెట్టి అరగంటయ్యాక వాడుకోవాలి.
ఎక్కువ టైం లేని వాళ్లు ఒక స్పూన్ నిమ్మరసం, రెండు స్పూన్ల వెనిగర్ , ఒక కప్ వాటర్ లో కలుపుకుని స్ప్రే బాటిల్ ల్ నింపుకోవాలి. కూరగాయలు కట్ చేసుకునే ముందు ఆ మిశ్రమాన్ని కూరగాయలపై స్ప్రే చేసి వెంటనే కట్ చేస్కోవచ్చు. పండ్లు కానీ, కూరగాయలకు కానీ పై తొక్క తీసి వాడుకోవడం చాలా ఉత్తమమైన మార్గం. కానీ అన్నింటిని అలా వాడుకోవడం అనేది సాధ్యం కాదు.