హైద్రాబాద్ టు విజయవాడ…N.H-9 అని గతంలో ఉండేది..ఇప్పుడు దాన్ని N.H-65 గా మార్చారు.? ఎందుకు ? ఏమిటి? ఎలా ? అని నన్ను నేను ప్రశ్నించుకొని శోధించుకున్న తర్వాత తెల్సిన విషయాన్ని మీతో పంచుకుంటున్న.!. ఈ నెంబర్ మార్పు 2010 ఏప్రిల్ 28 న జరిగింది. రోడ్లను గుర్తించడంలో గందరగోళం లేకుండా…. సింపుల్ గా గుర్తించేందుకు అప్పటి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిసింది.!
రోడ్లకు నెంబరింగ్ ఎలా ఇస్తారు?
రోడ్లకు…..పడమర టు తూర్పు, ఉత్తరం టు దక్షిణం ను నెంబరింగ్ ఇస్తారు. పడమర నుండి తూర్పు కు వెళ్ళే రహదారులకు…బేసి సంఖ్యను……. ఉత్తరం నుండి దక్షిణం కు వెళ్ళే రహదారులకు సరి సంఖ్యను పెడతారు. పడమర నుండి తూర్పుకు….1, 3, 5, 7, 9,…..( N.H-1- జమ్మూ కాశ్మీర్., N.H-87 తమిళనాడు.) ఉత్తరం నుండి దక్షిణం కు…2, 4, 6, 8…….. (NH-2 నార్డ్- ఈస్ట్ స్టేట్ ఆఫ్ ఇండియా…..NH-68 రాజస్థాన్ – గుజరాత్.! మేజర్ రహదారులు…. 1 డిజిట్, 2 డిజిట్ నెంబర్స్ నే కలిగి ఉంటాయి. త్రి డిజిట్ నెంబర్స్ ఉన్న నేషనల్ హైవేస్ ను… ఆఫ్ షూట్ హైవేలు అంటారు. ఇవి పెద్ద హైవేస్ కు అనుసందానంగా ఉంటాయి. ఉదాహరణకు…. 102, 202, 302…..అంటే…ఇందులో చివరి రెండు అంకెలు….ఓ పెద్ద జాతీయ రహదారిని ఇండికేడ్ చేస్తాయి. అంటే….ఈ నెంబర్ రహదారులు..2 వ నెంబర్ జాతీయ రహదారికి అనుసంధానంగా ఉండేవన్న మాట!!
ఇవే గాక…966A, 527B అనే నెంబర్స్ కూడా ఉంటాయి…దీని మీనింగ్ ఏంటంటే……. 966A, 66 అనే జాతీయ రహదారి యొక్క సఫిక్స్ రహదారి అని అర్థం.! సింపుల్ గా… N.H-1 …..పడమర నుండి తూర్పుకు వెళ్ళే రహదారి. NH-68…..ఉత్తరం నుండి దక్షిణం NH-102…. ఉత్తరం నుండి దక్షిణం వెళ్లే ప్రధాన రహదారికి అనుసంధానమైన రహదారి ( ఆఫ్ షూట్ రహదారి) NH-966A, NH-527B….ఉత్తరం నుండి దక్షిణం వెళ్లే ప్రధాన రహదారికి సఫిక్స్ రహదారి.