చాలా మంది సౌకర్యంగా ఉంటుందని రైలులో ప్రయాణం చేయాలని అనుకుంటుంటారు. అయితే ట్రైన్ లో ప్రయాణం చేయాలంటే ముందు రిజర్వేషన్ చేయించుకోవాలి. రిజర్వేషన్ చేయించుకున్న తర్వాత టికెట్ కన్ఫర్మ్ అవుతుంది. అయితే, ఒకసారి కొంత మంది ప్రయాణికులు వివిధ కారణాల వలన టికెట్ ఉన్నా కూడా ట్రైన్ మిస్ అవుతూ ఉంటారు. ఒకవేళ ప్రయాణం చేయకపోతే, ఆ డబ్బులు మొత్తం వేస్ట్ అయిపోతాయా..?, తిరిగి ప్యాసింజర్లకు ఆ టికెట్ డబ్బులు రైల్వే వారు ఇస్తారా..? పాసెంజర్ల టికెట్ వృధా అయిపోతుందా..? ఈ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఇండియన్ రైల్వేస్ రూల్స్ ప్రకారం, జనరల్ కోచ్ టికెట్ ఉండి ట్రైన్ మిస్ అయితే అతను ఇంకో రైలులో ప్రయాణం చేయవచ్చు. అయితే, ఒకటే క్యాటగిరి అయ్యి ఉండాలి. అప్పుడు రైలులో ట్రావెల్ చేయడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు..? ఒకవేళ కనుక వేరే క్యాటగిరి ట్రైన్ ఎక్కినట్లయితే ఫైన్ కట్టాల్సి ఉంటుంది.
ప్రీమియం ట్రైన్స్ అయినటువంటి వందే భారత్, రాజధాని ఎక్స్ప్రెస్ వంటి వాటికైతే జనరల్ టికెట్స్ పనికిరావు. ట్రైన్ మిస్ అయినప్పుడు ఆఫ్ లైన్ లో లేదా ఆన్లైన్ లో TDR ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఇది ఫైల్ అయిన తర్వాత రిఫండ్ అమౌంట్ వచ్చేస్తుంది. 60 రోజులకు డబ్బులు వారి ఖాతాలో పడతాయి. తత్కాల్ అయితే మాత్రం ఈ రిఫండ్ ఫెసిలిటీ ఉండదు.