Chanakya Tips Telugu : ఆచార్య చాణక్య చెప్పినట్లు చేయడం వలన, జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. చాణక్య చెప్పిన సూత్రాలని చాలామంది ఇప్పటికి కూడా పాటిస్తున్నారు. వీటిని పాటించడం వలన జీవితం బాగుంటుంది. జీవితంలో సమస్యలు కూడా రావు. సంతోషంగా ఉండొచ్చు. చాణక్య సంతోషకరమైన కుటుంబాన్ని నడిపించుకోవడానికి, కొన్ని విధానాలని రూపొందించారు. ఆయన చెప్పిన దాని ప్రకారం, భార్య భర్తలు ఒకరినొకరు ప్రశంసించుకోవాలి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు, కలిసికట్టుగా వాటిని ఎదుర్కొంటూ ఉండాలని చాణక్య చెప్పారు.
కొన్ని విషయాలని భార్య భర్తలు మధ్య మాత్రమే ఉంచుకోవాలని కూడా చాణక్య అన్నారు. చాలా మంది భార్య భర్తలు ఇటువంటి విషయాలని పట్టించుకోరు. కానీ, భార్యాభర్తలు ఎప్పుడూ కూడా కొన్ని విషయాలని రహస్యంగానే ఉంచుకోవాలని చాణక్య అన్నారు. భార్యకి భర్త కొన్ని విషయాలను చెప్పకుండా, రహస్యంగా ఉంచుకోవాలని కూడా చాణక్య అన్నారు. అవమానం గురించి బాధ కలగడం గురించి ఎప్పుడు చెప్పకూడదట.
పురుషులు పని చేయడానికి, బయటకు వెళ్ళినప్పుడు, కొన్నిసార్లు అవమానాలు ఉంటాయి. వాటిని ఎప్పుడూ భార్యతో చెప్పుకోకూడదు పురుషులు. భార్య భర్త బాధల్ని అర్థం చేసుకుంటుంది. కానీ, కొన్ని సందర్భాలలో భర్త దూషిస్తే భార్య అదే మాట పదేపదే చెప్తూ బాధ పెడుతుంది. కనుక, ఇటువంటి విషయాలని రహస్యంగా ఉంచుకోవాలని చాణక్య అన్నారు. అలానే, చాణక్య ప్రకారం దానధర్మాల గురించి కూడా ఎప్పుడు రహస్యంగానే ఉంచాలి.
భార్యకి కూడా చెప్పకూడదు. కుడి చేతతో చేసే సహాయం, ఎడమ చేతికి కూడా తెలియకూడదు. దానధర్మం గురించి అసలు ఎవరికీ చెప్పుకోకూడదు. భార్యకి కూడా ఈ విషయాలు చెప్పకూడదు. ఎందుకంటే, ఆమె అడ్డుకునే అవకాశం ఉంటుంది. బలహీనతల గురించి కూడా ఎదుటి వాళ్ళకి చెప్పకూడదు. వీటిని ఎదుటి వాళ్ళకి చెప్తే, అనవసరంగా మీరే ఇబ్బందుల్ని ఎదుర్కోవాలి. కాబట్టి, ఎప్పుడూ ఈ పొరపాట్లు చేయొద్దు.