సంశయానికి అసలైన విరుగుడు కార్యాచరణే! తమలో పూర్తిస్థాయి ఆత్మవిశ్వాసం కలిగాకే కార్యరంగంలోకి దిగాలని నిర్ణయించుకొని.. చాలామంది ఏళ్లకొద్దీ ఎదురుచూస్తూ ఉంటారు. వాస్తవమేంటంటే- కార్యాచరణకు ఉపక్రమించాకే మనలో ఆత్మవిశ్వాసం క్రమక్రమంగా పెరుగుతూ ఉంటుంది. వాస్తవాలను మీ విశ్వాసాలు ప్రభావితం చేయగలవు! ఇతరులను మీరు స్వార్థపరులుగా విశ్వసిస్తే.. వారిలో ఎప్పుడూ స్వార్థపూరిత లక్షణాలే మీకు కనిపిస్తాయి. మిమ్మల్ని మీరు అశక్తుడిగా భావిస్తే.. ఆ భావనను ధ్రువీకరించే కారణాలే చుట్టూ దర్శనమిస్తాయి. మీ జీవితాన్ని మెరుగుపరచుకోవాలంటే.. ముందుగా మీ విశ్వాసాలను సానుకూలంగా మార్చుకోండి.
మీ పేగుల ఆరోగ్యానికి నోరు అద్దం పడుతుంది. పేగుల్లో ఇబ్బందికర పరిస్థితులు ఉంటే- హానికర బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఆమ్ల స్థాయులు పెరుగుతాయి. పోషకాల శోషణ సామర్థ్యం క్షీణిస్తుంది. ఫలితంగా- దంతాలు పుచ్చిపోతాయి. చిగుళ్ల నుంచి తరచూ రక్తం కారుతుంది. నోటి నుంచి దుర్వాసన వస్తుంది. పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటే.. నోటి ఆరోగ్యమూ బాగుంటుంది. సరైన దిశ లేని గమనం ఎప్పటికీ వ్యర్థమే. పోటీలో ఒక కారు ఎంత వేగంగా ప్రయాణించినా.. అది వెళ్లేది తప్పు దిశలో అయితే చివరికి పరాజయమే మిగులుతుంది.
మీరేం పని చేస్తున్నారు.. ఏం సాధించారు.. ఎంత సంపాదించారు.. ఇవేవీ వాస్తవానికి లెక్కలోకి రావు! ఇతరులతో, ముఖ్యంగా మీతో సన్నిహితంగా ఉండే వ్యక్తులతో మీరెంత గౌరవంగా నడుచుకుంటున్నారన్నదే మీ అసలైన విలువను తెలియజేస్తుంది. శక్తి ఒకరి నుంచి మరొకరికి సంక్రమించగలదు! మీ చుట్టూ- సమస్యలను పరిష్కరించేవారు ఉండేలా చూసుకోండి. ఎప్పుడూ ఏదో ఒకటి ఫిర్యాదు చేస్తూనే ఉండేవారికి దూరంగా ఉండండి. సాకులపై కాకుండా, పరిష్కార మార్గాలపై దృష్టిపెట్టేవారు మీ చుట్టూ ఉన్నప్పుడు జీవితం సాఫీగా సాగుతుంది.