ఇంకో రకంగా చెప్పాలంటే పాములు ఆత్మ హత్య చేసుకుంటాయా? మొదటి ప్రశ్న పాము తనను తాను ఎందుకు కొరుకుతుంది? పాములు ఎక్కువగా ఒత్తిడికి గురైనప్పుడు, దూకుడుగా, వేడిగా లేదా ఆకలితో ఉన్నప్పుడు తమపై తాము దాడి చేయగలవు, పాములు బాగా చూడలేనప్పుడు, అవి నలిగినప్పుడు, లేదా తమ తోకను మరొక పాము తోక అనుకొన్నప్పుడు తమను తాము కొరుక్కోగలవు. అయితే పాము తనను తాను కరిస్తే చనిపోతుందా?
కాదు. పాములు తమ సొంత విషంతో తమను తాము చంపుకోలేవు. అయితే అవి వాటి కాటుతోనే జరిగిన శారీరక గాయాల వల్ల చనిపోవచ్చు. అలాగే, తమ సొంత విషానికి రోగనిరోధక శక్తిని కలిగి ఉన్నప్పటికీ, ఒకే జాతికి చెందిన పాముల్లో నమూనాలు కొద్దిగా భిన్నమైన విష కూర్పులను కలిగి ఉండి, ఒకదానికొకటి కొరికితే చనిపోవచ్చు కూడా.
ఐనా ఏదైనా పాము తనను తాను కరచుకొని చనిపోయిందా? ఏవైనా రిపోర్టులు ఉన్నాయా..? విషపూరితమైన పాములు తమ రక్తంలో నిర్దిష్ట ప్రొటీన్‌లను కలిగి ఉంటాయి, అవి వాటి విషాన్ని తటస్తం చేస్తాయి. ఏదేమైనా, పాములు తమను తాము కరిచి చనిపోయాయని కొన్ని ధృవీకరించని కొన్ని నివేదికలు కూడా ఉన్నాయి. అయితే దీని గురించి శాస్త్రీయంగా ఎక్కడా నిరూపణ కాలేదు.