స్త్రీ లకు ఈ ప్రపంచం లో ప్రత్యేక స్థానం ఉంది, అమ్మ అనే పదానికి ఎంతో విలువుంది, తల్లి అనే పదాన్ని మాటల్లో వర్ణించలేము. స్త్రీ గురించి స్త్రీ భౌతిక రూపాన్ని బట్టి వారి జీవితం ఎలా ఉంటుందో మహావిష్ణువు విశ్లేషించినట్టు విష్ణు పురాణంలో పేర్కొన్నారు. స్త్రీ గురించి తెలపమంటూ లక్ష్మీదేవి శ్రీమన్నారాయణుడిని అడిగితే, వారి గురించి వర్ణించినట్లు అందులో తెలియజేశారు. అలాగే భౌతిక లక్షణాలను బట్టి మహిళలను 12 వర్గాలుగా వర్ణించారు. మహా విష్ణువు చెప్పిన ప్రకారం గుండ్రని ముఖం కలిగి, నాభి కుడివైపునకు వంగి ఉండే మహిళలు అత్యంత అదృష్టంవంతులే కాదు, జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు.పొడిబారిన జుట్టు, ఉబ్బెత్తు కళ్లు ఉన్న స్త్రీలు పిన్న వయసులోనే వైధవ్యాన్ని పొందుతారు.
ప్రకాశవంతమైన మేని ఛాయ, మృదువైన, కలువ రేకుల్లాంటి చేతులు కలిగిన మహిళలు నిరాడంబరులు. వీళ్లు స్థిరమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. పున్నమి చంద్రుడి లాంటి ముఖం, ఉదయించే సూర్యుడి ప్రకాశం కలిగిన స్త్రీలు ఉల్లాసం, ఉత్సాహంతో కూడిన జీవితాన్ని గడుపుతారు. హస్త రేఖలు గజిబిజిగా ఉండి, అవి అరచేతుల నుంచి బయటకు వచ్చినట్టు కనిపించే వాళ్లు జీవితాంతం కష్టాలు అనుభవించడమే కాదు, యాతనతో జీవిస్తారు. ఒకవేళ అరచేతుల్లో రేఖలు తక్కువ ఉంటే కొన్నిసార్లు పేదరికంతో ఇబ్బంది పడతారు. హస్త రేఖలు లేత గులాబి రంగులో ఉండే మహిళలకు ఆనందంతోపాటు జీవితంలోనూ ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. చేతి రేఖలు నలుపుగా ఉంటే బానిసలా బతుకుతారు.
చేతిలో చక్రం లేదా వల ఆకారం, చెవిపోగు సంకేతం ఉండే స్త్రీలకు పుట్టే పిల్లలు శాసనకర్తలు, పాలితులు అవుతారు. ఛాతిపై అవాంచిత రోమాలు కలిగి, కింద పెదవి ఉబ్బినట్లు ఉండే మహిళలు భర్త ద్వారా నష్టపోతారు. అరచేతిలో తోరణం ఆకారంలో రేఖలు ఉంటే తమ కంటే ఉన్నత కుటుంబంలో కోడలిగా అడుగుపెడతారు. లేత గోధుమ రంగు జుట్టు, గుండ్రని నాభి ఉన్న స్త్రీలు పేదరికం లేదా మధ్య తరగతి జీవితాన్ని గడుపుతారు.
పాదానికి ఉండే చిన్న, పెద్ద వేళ్లు భూమిని తాకని మహిళలు ముఖ్యమైన సందర్భాల్లో తీవ్ర ఒడొదొడుకులకు గురవుతారు. ప్రకాశవంతం, మనోహరమైన కనులు కలిగిన మహిళలకు అదృష్టం వెన్నంటే ఉంటుంది. మృదువైన చర్మం కలిగిన స్త్రీలు వైవాహిక జీవితాన్ని ఉల్లాసంగా గడుపుతారు.