ప్రస్తుత కాలంలో ఆల్కహాల్ తాగడం అనేది ఒక ఫ్యాషన్ గా మారిపోయింది. పూర్వకాలంలో ఏదైనా మత్తు పానీయం తాగాలంటే తండ్రి ముందు కొడుకు, కొడుకు ముందు తండ్రి, పెద్దవాళ్ల ముందు చిన్నవాళ్లు తాగే వారు కాదు. కానీ ప్రస్తుత కాలంలో తండ్రి కొడుకులు, భార్య భర్తలు, కలిసే తాగుతున్నారు.. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుత కాలంలో తాగని వారి కంటే తాగే వారే ఎక్కువ మంది ఉన్నారని చెప్పవచ్చు. వీకెండ్ వస్తే నలుగురు ఫ్రెండ్స్ తో కలిసి మామ ఏం తాగుదాం బీరా, మందా, మళ్లీ అందులో ఏంటి బ్రాందీయా, విస్కీయా సెలెక్ట్ చేసుకొని మరీ ఎంజాయ్ చేస్తున్నారు. మరి వీటిలో విస్కీ, బ్రాందీ మధ్య తేడా ఏమిటో ఓ సారి తెలుసుకుందాం..
సాధారణంగా బ్రాందీని ద్రాక్ష పండ్లు, వివిధ పండ్ల నుంచి తయారయ్యే వైన్ నుంచి బ్రాందీ ని తయారు చేస్తారు. విదేశాల్లో ఈ బ్రాందీని ఆఫ్టర్ డిన్నర్ డ్రింక్ గా పిలుస్తారు. ఈ బ్రాందీలో ఆల్కహాల్ పర్సంటేజ్ అనేది 35 నుంచి 60 శాతం ఉంటుంది. కేరమిల్క్, వెనిలా, డ్రై ఫ్రూట్ ఫ్లేవర్స్ లో దీన్ని తయారు చేస్తారు. నిజంగా చెప్పాలంటే స్వచ్ఛమైన పండ్ల నుంచి తయారుచేసిన దాన్నే బ్రాందీ అని పిలుస్తారు.
ఇక విస్కీ విషయానికి వస్తే దీన్ని బార్లీ, జొన్న, మొక్కజొన్న గోధుమలు లాంటి ధాన్యపు గింజలతో తయారుచేస్తారు. ఆ ధాన్యాలు పొడిగా చేసి దాన్ని వేడినీళ్లలో పోసి అండెన్స్ కలుపుతారు. ఈ మిశ్రమానికి ఈస్ట్ జోడించి బాగా కలిపి దీని నుంచే ఆల్కహాల్ తయారు చేస్తారు. తర్వాత దీన్ని డిస్టిలైజ్ చేసి ప్రూఫ్ స్ప్రిరిట్ గా మారుస్తారు. దీన్ని 8 నుంచి 12 ఏళ్ల పాటు నిల్వ ఉంచి ఎక్కువ రేటుకు అమ్మేస్తూ ఉంటారు. ఈ విస్కీ లో 40 శాతం పాటు ఆల్కహాల్ ఉంటుంది.